ఉన్నతమైన రేపటి కోసం అన్ని శక్తులు కలిసొస్తున్నాయి

ఎదురు చూపులకి తెర పడింది. ‘కల్కి 2898 ఎ.డి’ విడుదల ఖరారైంది. మేలైన రేపటి కోసం అన్ని శక్తులు కలిసి వస్తున్నాయంటూ జూన్‌ 27న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు  సినీ వర్గాలు శనివారం ప్రకటించాయి.

Published : 28 Apr 2024 00:37 IST

దురు చూపులకి తెర పడింది. ‘కల్కి 2898 ఎ.డి’ విడుదల ఖరారైంది. మేలైన రేపటి కోసం అన్ని శక్తులు కలిసి వస్తున్నాయంటూ జూన్‌ 27న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు  సినీ వర్గాలు శనివారం ప్రకటించాయి. ప్రభాస్‌ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌హాసన్‌, దీపికా పదుకొణె, దిశా పటానీ కీలక పాత్రలు పోషించారు. నాగ్‌ అశ్విన్‌ దర్శకుడు. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి.అశ్వనీదత్‌ నిర్మిస్తున్నారు. భారతీయ పురాణాల ఆధారంగా, సైన్స్‌ ఫిక్షన్‌ కథతో రూపొందుతున్న ఈ సినిమాని మొదట మే 9న విడుదల చేయాలనుకున్నారు. కానీ ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. అప్పటి నుంచి కొత్త విడుదల తేదీ కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురు చూస్తూ వచ్చారు. ఎట్టకేలకి చిత్రబృందం విడుదల తేదీని అధికారికంగా సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించింది. ఇందులో అమితాబ్‌ బచ్చన్‌ పోషించిన పాత్రని పరిచయం చేస్తూ ఇటీవలే ఓ వీడియోని పంచుకున్న విషయం తెలిసిందే.  అశ్వత్థామగా ఆయన తెరపై సందడి చేయనున్నారు. త్వరలోనే మరిన్ని పాత్రలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. భారీ వ్యయంతో రూపొందుతున్న ఈ చిత్రానికి సంతోష్‌ నారాయణన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని