ఆన్లైన్లో చై-నిహారిక పార్టీ ఫొటోలు
నటుడు నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల డిసెంబర్ నెలలో తన సింగిల్ లైఫ్‌కి గుడ్ బై చెప్పనున్నారు. చైతన్య జొన్నలగడ్డ అనే వ్యక్తితో ఆమె ఏడడుగులు వేయనున్నారు. దీంతో ఇప్పటికే మెగా కుటుంబంలో పెళ్లి పనులు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే నిహారిక.. అక్టోబర్ నెలలో తన స్నేహితులతో....
హైదరాబాద్: నటుడు నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల డిసెంబర్ నెలలో తన సింగిల్ లైఫ్‌కి గుడ్ బై చెప్పనున్నారు. చైతన్య జొన్నలగడ్డ అనే వ్యక్తితో ఆమె ఏడడుగులు వేయనున్నారు. దీంతో ఇప్పటికే మెగా కుటుంబంలో పెళ్లి పనులు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే నిహారిక.. అక్టోబర్ నెలలో తన స్నేహితులతో కలిసి గోవాలో బ్యాచిలరేట్ పార్టీ జరుపుకున్నారు. అయితే ఈ పార్టీలో నిహారికతోపాటు ఆమెకు కాబోయే భర్త చైతన్య కూడా పాల్గొన్నారు. ఆ పార్టీకి సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలను నిహారిక స్నేహితులు అప్పట్లో షేర్ చేశారు కూడా. అయితే తాజాగా నిహారిక-చైతన్య ఉన్న పార్టీ ఫొటోలు కొన్ని బయటకు వచ్చాయి. వాటిని చూస్తే.. బ్యాచిలరేట్ పార్టీకి సంబంధించినవిగానే అనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఫొటోలు ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు.. నిహారిక-చైతన్యలకు ‘ఆల్ ది బెస్ట్’ చెబుతున్నారు. అంతేకాకుండా ఈ ఫొటోలు గోవా పార్టీవేనా అనుకుంటున్నారు.
కాగా, తాజాగా దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని నాగబాబు నివాసంలో జరిగిన వేడుకల్లో నిహారికకు కాబోయే భర్త చైతన్య పాల్గొన్నారు. ఈ వేడుకల్లో భాగంగా ఇంటి ఆవరణలో నిహారిక వేసిన రంగోలీని వరుణ్ తేజ్ ప్రశంసించారు. అనంతరం తన చెల్లి-బావలతో కలిసి వరుణ్ ఫొటోలకు పోజులిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
టాలీవుడ్ హీరోలపై కాజల్ ఆసక్తికర కామెంట్స్.. ఎవరెవరి గురించి ఏమన్నారంటే
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) తన ఇష్టాయిష్టాలను పంచుకున్నారు. -
బ్యాలెన్స్ రూ.6 లక్షలు ఇస్తామన్నా పాయల్ రాజ్‌పుత్ ప్రచారానికి రాలేదు.. : నిర్మాతల మండలి
నటి పాయల్ రాజ్‌పుత్ సోషల్‌మీడియా వేదికగా పెట్టిన పోస్టు సరైన నిర్ణయం కాదని నిర్మాతల మండలి పేర్కొంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (21/05/24)
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
-
‘ఆర్సీబీ రూ.5 కోట్లు డ్రైనేజీలో వేసిందన్నారు.. వాట్సాప్ గ్రూప్ల్లోంచి బయటికి వచ్చాం’
-
అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!
-
‘వారంలో 10 కేజీల గోధుమ పిండెలా తినాలి?’.. క్విక్ కామర్స్ సంస్థపై యూజర్ ఫైర్
-
వారి సంభాషణలు రికార్డు చేయలేదు.. రోహిత్ ఆరోపణలను ఖండించిన స్టార్‌స్పోర్ట్స్