NTR: ‘ఏఐ’ మాయ.. ఎన్టీఆర్‌ని తలపించేలా.. ఫొటో వైరల్‌

‘ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌’ (ఏఐ) టెక్నాలజీ సాయంతో క్రియేట్‌ చేసిన ఓ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. ఎన్టీఆర్‌ని తలపించేలా ఉన్న ఆ పిక్చర్‌ను మీరూ చూసేయండి..

Published : 22 Sep 2023 01:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొన్ని ఫొటోలు మనల్ని గత జ్ఞాపకాల్లోకి తీసుకెళ్తాయి. మరికొన్ని పదే పదే చూడాలనిపించేలా చేస్తాయి. ఇంకొన్ని అద్భుతమనిపిస్తాయి. ఈ మూడో జాబితాలోకి చేరింది పై ఫొటో. ఆకాశం, సముద్రం, పడవలతో కూడిన ఈ పిక్‌ని తీక్షణంగా చూస్తే టాలీవుడ్‌ అగ్ర కథానాయకుల్లో ఒకరైన ఎన్టీఆర్‌ (NTR) ముఖంలా కనిపిస్తుంది కదూ! నెట్టింట ప్రస్తుతం ఇదే అందరి దృష్టిని ఆకర్షించి, ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నెటిజన్లు, ఎన్టీఆర్‌ అభిమానులతోపాటు పలువురు సినీ ప్రముఖులూ ఈ పిక్చర్‌కు ఫిదా అవుతున్నారు. ఈ ఫొటో రూపకర్త మరెవరో కాదు ప్రముఖ విజువల్‌ ఎఫెక్ట్స్‌ సూపర్‌వైజర్‌ శ్రీనివాస్‌ మోహన్‌ (srinivas mohan). ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) ఇల్యూషన్‌ టూల్‌ సాయంతో దాన్ని తీర్చిదిద్దారు. సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేయగా అది కొన్ని క్షణాల్లో లక్షల లైక్స్‌ సొంతం చేసుకోవడం విశేషం.

అమితాబ్‌ ఇచ్చిన ఐడియా.. 12వేల మంది వస్తారనుకుంటే లక్షమంది వచ్చారు!

ఎన్టీఆర్‌ హీరోగా దర్శకుడు కొరటాల శివ.. ‘దేవర’ (Devara) సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఓ తీర ప్రాంతం ఇతివృత్తంగా ఈ సినిమా రూపొందుతోంది. సంబంధిత లొకేషన్‌లో ఫొటోను క్యాప్చర్‌ చేసి ‘ఏఐ’ సాంకేతికతతో ఎన్టీఆర్‌ ఫేస్‌ కనిపించేలా క్రియేట్‌ చేసినట్లు తెలుస్తోంది. ‘ఫొటోనే ఇంత ఆసక్తిగా ఉంటే సినిమా ఏ స్థాయిలో ఉంటుందో?’ అని అభిమానులు చర్చించుకుంటున్నారు. ఈ చిత్రంలో.. భయం తెలియని వాళ్లకు భయాన్ని పరిచయం చేసే శక్తిమంతమైన వ్యక్తిగా ఎన్టీఆర్‌ కనిపించనున్నారు. జాన్వీ కపూర్‌ కథానాయిక. బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 5న ఈ సినిమా విడుదల కానుంది. శ్రీనివాస మోహన్‌ విషయానికొస్తే.. గతంలో ‘2. ఓ’, ‘బాహుబలి: ది బిగినింగ్‌’, ‘రోబో’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తదితర చిత్రాలకు విజువల్‌ ఎఫెక్ట్స్‌ పర్యవేక్షకుడిగా వ్యవహరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని