Laal Singh Chaddha: ‘లాల్‌సింగ్‌ చడ్డా’ వీక్షించిన సీఎం మాన్‌.. ఏమన్నారంటే?

బాలీవుడ్‌ కథానాయకుడు ఆమిర్‌ఖాన్‌ (Aamir Khan) ప్రధాన పాత్రలో నటించిన కామెడీ డ్రామా మూవీ ‘లాల్‌సింగ్‌ చడ్డా’ను పంజాబ్‌ ......

Updated : 14 Aug 2022 18:02 IST

చండీగఢ్‌: ప్రముఖ బాలీవుడ్‌ కథానాయకుడు ఆమిర్‌ ఖాన్‌ (Aamir Khan) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘లాల్‌ సింగ్‌ చడ్డా’. ఈ సినిమాను పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ ఆదివారం వీక్షించారు. పరస్పర సోదరభావంతో మెలగాలన్న సందేశాన్నిచ్చేలా  ఈ ఈ చిత్రం ఉందని ఆయన మెచ్చుకున్నారు. యువ హృదయాల్లో విద్వేష బీజాలు నాటనివ్వదని పేర్కొన్నారు. ఈ చిత్రం చూసిన భగవంత్‌ మాన్‌.. హీరో ఆమిర్‌ ఖాన్‌, ఆ చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు.

లాల్‌సింగ్‌ చడ్డా చిత్రాన్ని చూసే అవకాశం నాకు ఈరోజు లభించింది. ఈ సినిమా పరస్పర సోదరభావాన్ని పెంపొందించేదిగా ఉంది. అలాగే, యువ హృదయాల్లో విద్వేషాలకు చోటివ్వదు. ఆమిర్‌ ఖాన్‌, ఆయన బృందానికి నా అభినందనలు

- ట్వీట్‌లో సీఎం మాన్‌

1994లో విడుదలైన ‘ఫారెస్ట్ గంప్‌’కి (Forrest Gump) రీమేక్‌గా ‘లాల్‌సింగ్‌ చడ్డా’ చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అద్వైత్‌ చందన్‌ తెరకెక్కించిన ఈ చిత్రంలో కరీనా కపూర్, నాగ చైతన్య, మోనా సింగ్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని