పోలీస్‌ అధికారిగా నటించనున్న రామ్‌?

రామ్‌ పోతినేని కథానాయకుడిగా లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది. శ్రీనివాసా సిల్వర్ స్ర్కీన్‌ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రంలో రామ్‌ పవర్‌పుల్‌ పోలీస్‌ అధికారి పాత్రలో నటించనున్నాడట.

Published : 03 Apr 2021 12:30 IST

ఇంటర్నెట్‌ డెస్క్: రామ్‌ కథానాయకుడిగా లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. కృతి శెట్టి కథానాయిక. శ్రీనివాసా సిల్వర్ స్ర్కీన్‌ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రంలో రామ్‌ పవర్‌పుల్‌ పోలీస్‌ అధికారి పాత్రలో నటించనున్నాడట. పవన్‌ కుమార్‌ సమర్పణలో ‘రాపో 19’ వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రం యాక్షన్‌ ఎంటర్‌టైన‌ర్‌ అలరించడంతో పాటు, సామాజిక సందేశాన్ని అందివ్వనుందట.

శ్రీనివాసా చిట్టూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సినిమా తెలుగు - తమిళంలో ద్విభాషా చిత్రంగా తెరకెక్కనుంది. వచ్చే ఏడాది ఆరంభంలోనే సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు నిర్మాణ సంస్థ యోచిస్తున్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని