Ranveer Deepika: దీపిక-రణ్వీర్ లిప్‌లాక్.. పిక్ వైరల్
వివాహం అనంతరం కూడా వరుస సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు నటి దీపికా పదుకొణె. ఆమె ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త చిత్రం ‘గెహ్రాహియా’. షకున్ బత్రా దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ ప్రేమకథా...
సతీమణిని ప్రశంసిస్తూ నటుడు పోస్ట్
ముంబయి: వివాహం అనంతరం కూడా వరుస సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు నటి దీపికా పదుకొణె. ఆమె ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త చిత్రం ‘గెహ్రాహియా’. షకున్ బత్రా దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ ప్రేమకథా చిత్రం శుక్రవారం అమెజాన్ ప్రైమ్ వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయం అందుకుంది. ఈ సినిమాలో దీపిక నటన అద్భుతంగా ఉందంటూ అందరూ మెచ్చుకుంటున్నారు.
‘గెహ్రాహియా’ సక్సెస్‌పై దీపిక భర్త, నటుడు రణ్వీర్ సింగ్ కూడా ఆనందం వ్యక్తం చేశాడు. దీపికను చూస్తుంటే గర్వంగా ఉందంటూ ట్వీట్ చేశాడు. దీపికను ప్రేమగా ముద్దాడుతున్న ఓ ఫొటోను ఆయన సోషల్‌మీడియా వేదికగా షేర్ చేస్తూ.. ‘‘అత్యద్భుతం.. ఈ సినిమాలో నీ ప్రదర్శన మాస్టర్‌క్లాస్ బేబీ..! నీ ప్రదర్శన హృదయాన్ని హత్తుకునేలా సాగింది. నువ్వు నీ బెస్ట్ ఇచ్చావు. నువ్వు నన్ను గర్వపడేలా చేశావ్’’ అని పొగిడాడు. ప్రస్తుతం ఈ జంట ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది.
నవతరం ప్రేమ కథతో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో అనన్యపాండే, సిద్ధాంత్ చతుర్వేది కీలకపాత్రలు పోషించారు. దీపిక సోదరి పాత్రలో అనన్య నటించగా.. ఆమెకు కాబోయే భర్తగా సిద్ధాంత్ మెప్పించారు. పరిస్థితుల కారణంగా సోదరి పెళ్లి చేసుకోబోయే వ్యక్తితో దీపిక ప్రేమలో పడటం.. అతడితో జీవితాన్ని పంచుకోవాలని అనుకోవడం.. ఈ విషయం సోదరికి తెలియడం వంటి ఆసక్తికర అంశాలతో ఈ సినిమా రూపుదిద్దుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘నువ్వు లేకపోయినా ఫర్వాలేదు’ అంటూ నెటిజన్ కామెంట్.. హీరో ఏమన్నారంటే?
-
IPL 2024: ‘నో డౌట్.. ఈ సీజన్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అతడే: గ్రేమ్ స్మిత్
-
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్‌కు బెయిల్
-
ఈ ధైర్యం పేరు జస్ప్రీత్.. వివరాలు చెప్పండి ప్లీజ్: ఆనంద్ మహీంద్రా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
సోనాక్షీతో ఇంటిమేట్ సీన్స్.. అందుకే సిగ్గుపడ్డాను: ‘హిరామండీ’ నటుడు