Heeramandi: సోనాక్షీతో ఇంటిమేట్‌ సీన్స్‌.. అందుకే సిగ్గుపడ్డాను: ‘హీరామండి’ నటుడు

‘హీరామండి’లో సోనాక్షీతో తన సన్నివేశాల గురించి నటుడు ఇంద్రేష్‌ మాలిక్‌ స్పందించారు. 

Updated : 06 May 2024 21:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ తెరకెక్కించిన తొలి వెబ్‌సిరీస్‌ ‘హీరామండి’. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా తాజాగా ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ సిరీస్ ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంది. ఇందులో సోనాక్షీతో (Sonakshi Sinha) ఇంటిమేట్‌ సన్నివేశం గురించి నటుడు ఇంద్రేష్‌ మాలిక్‌ మాట్లాడారు.

‘సోనాక్షీకి, నాకు మధ్య కొన్ని ఇంటిమేట్‌ సీన్స్‌ ఉన్నాయి. వాటి చిత్రీకరణ సమయంలో ఆమె తల్లి కూడా సెట్‌లో ఉన్నారు. దీంతో నాకు సిగ్గుగా అనిపించింది. అప్పుడు సోనాక్షీ నాతో మాట్లాడి రిలాక్స్‌గా ఉండమని కోరారు. సిరీస్‌కు ఇలాంటి సన్నివేశాలు అవసరమని ఆమె తల్లి ముందే నాతో చర్చించారు’ అని చెప్పారు. అలాగే దర్శకుడి గురించి ఇంద్రేష్‌ మాట్లాడుతూ.. ‘భన్సాలీ ప్రతీ సన్నివేశాన్ని పర్‌ఫెక్ట్‌గా చిత్రీకరిస్తారు. షూటింగ్‌కు గంట ముందే నటీనటులతో చర్చిస్తారు. అందుకే ఎక్కువ రీటేక్‌లు అవసరం ఉండేవి కాదు. ఇందులో నా పాత్ర ఎన్నో భావోద్వేగాలతో ముడిపడి ఉంది. దానికి మంచి స్పందన వచ్చినందుకు ఆనందిస్తున్నా. ఇందులో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించేటప్పుడు నాకు తెలియకుండానే భయపడ్డాను. భన్సాలీ వాటి గురించి వివరంగా చెప్పి ధైర్యాన్నిచ్చారు’ అని ప్రశంసించారు. 

ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. థియేటర్‌/ఓటీటీ చిత్రాలివే!

‘హీరామండి’పై మండిపడిన వివేక్‌ అగ్నిహోత్రి

మరోవైపు ఈ సిరీస్‌పై బాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి విమర్శలు కురిపించారు. ‘నేను దీన్ని ఇంకా చూడలేదు. కానీ లాహోర్‌లోని హీరామండిని చాలాసార్లు సందర్శించాను. బాలీవుడ్‌ నుంచి  ఇలాంటి సిరీస్‌లు వస్తాయని నాకు తెలుసు. వేశ్యా గృహాలు ఎప్పుడూ ఐశ్వర్యం, గ్లామర్‌, అందాలకు చిహ్నాలు కావు. అవి బాధలకు చిహ్నాలు. దీని గురించి తెలియాలంటే శ్యామ్‌ బెనెగల్ తెరకెక్కించిన ‘మండి’ చూడాలి. సృజనాత్మకత అంటే మానవ బాధలను గ్లామరైజ్‌ చేసి చూపించడమా? మురికివాడల్లో ఉండే వారి జీవితాన్ని సమృద్ధిగా చూపించడం సరైన పద్ధతేనా?’ అని ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని