Ranveer Singh: సర్కస్‌ రుచి చూపించడానికి

రణ్‌వీర్‌సింగ్‌ కథానాయకుడిగా రోహిత్‌ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘సర్కస్‌’. ‘సింబా’ లాంటి హిట్‌ సినిమా తర్వాత ఈ ఇద్దరి కలయికలో వస్తోన్న ఈ చిత్రంపై రణ్‌వీర్‌ అభిమానులు ఎక్కువ ఆశలే పెట్టుకున్నారు. 

Updated : 18 Nov 2022 07:02 IST

ణ్‌వీర్‌సింగ్‌ (Ranveer Singh) కథానాయకుడిగా రోహిత్‌ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘సర్కస్‌’ (Cirkus). ‘సింబా’ లాంటి హిట్‌ సినిమా తర్వాత ఈ ఇద్దరి కలయికలో వస్తోన్న ఈ చిత్రంపై రణ్‌వీర్‌ అభిమానులు ఎక్కువ ఆశలే పెట్టుకున్నారు. ఈ సినిమా ఎలా ఉంటుందోనని ఎదురుచూస్తున్న ప్రేక్షకుల కోసం ట్రైలర్‌ రూపంలో కొంచెం రుచి చూపించడానికి సన్నాహాలు చేస్తున్నారు. డిసెంబరు తొలి వారంలో ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయనున్నారని సమాచారం. డిసెంబరు 23న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని