Ravanasura: నన్ను ఆపగలిగేది నేనే
‘‘ఈ భూమ్మీద నన్ను ఆపగలిగేవాడు ఎవడైనా ఉన్నాడంటే.. అది నేనే’’ అంటున్నారు రవితేజ. ఆయన కథానాయకుడిగా సుధీర్‌వర్మ తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ ‘రావణాసుర’.
‘‘ఈ భూమ్మీద నన్ను ఆపగలిగేవాడు ఎవడైనా ఉన్నాడంటే.. అది నేనే’’ అంటున్నారు రవితేజ. ఆయన కథానాయకుడిగా సుధీర్‌వర్మ తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ ‘రావణాసుర’. అభిషేక్ పిక్చర్స్, ఆర్.టి.టీమ్ వర్క్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. సుశాంత్ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా ఏప్రిల్ 7న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఈ చిత్ర ట్రైలర్ విడుదల చేశారు. దాదాపు రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ ప్రచార చిత్రంలో వినోదం, యాక్షన్, క్రైమ్, మలుపులు అన్నీ చూపించారు. ఈ సినిమాలో రవితేజ న్యాయవాదిగా కనిపించనున్నారు. అయితే ‘‘వాడు క్రిమినల్ లాయర్ కాదు. లా చదివిన క్రిమినల్’’ అనే డైలాగ్‌తో తనలోని మరో కోణాన్నీ పరిచయం చేశారు. ‘‘మర్డర్ చేయడం క్రైమ్. దొరక్కుండా మర్డర్ చేయడం ఆర్ట్. ఐయామ్ యాన్ ఆర్టిస్ట్. రెస్పెక్ట్ మై ఆర్ట్ బేబీ’’ అంటూ ట్రైలర్‌లో రవితేజ చెప్పిన డైలాగ్ మరింత ఆసక్తి రేకెత్తించింది. ఇందులో అను ఇమ్మాన్యుయేల్, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్, దక్షా నగార్కర్, పూజిత పొన్నాడ నాయికలు. హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో స్వరాలు సమకూర్చగా.. విజయ్ కార్తీక్ కన్నన్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Kim Jong Un: కిమ్ బరువు 140 కిలోలు.. తీవ్ర నిద్రలేమితో అవస్థలు..!
-
Movies News
Chinmayi: పెళ్లంటూ చేసుకుంటే చిన్మయినే చేసుకోవాలని అప్పుడే అనుకున్నా: రాహుల్ రవీంద్రన్
-
General News
Top 10 News @ 9AM: ఈనాడు.నెట్ టాప్ 10 న్యూస్ @ 9AM
-
Crime News
Tirupati: ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కారు.. ముగ్గురు తెలంగాణ వాసుల మృతి
-
Ts-top-news News
Khairatabad Ganesh: ఖైరతాబాద్ మహాగణపతి 61 అడుగులు
-
Ap-top-news News
Tirumala Ghat Road: వాహనాలను నియంత్రించకుంటే నష్టమే.. తిరుమల ఘాట్‌రోడ్లలో వరుస ప్రమాదాలు