Salaar: అదరగొట్టిన ‘సలార్‌’.. మొదటి రోజు కలెక్షన్స్‌ ఎంతంటే!

ప్రశాంత్‌ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సలార్’ (Salaar) భారీ విజయాన్ని అందుకుంది. దీంతో మొదటిరోజు వసూళ్లలో రికార్డులు సృష్టించినట్లు తెలుస్తోంది.

Updated : 23 Dec 2023 11:33 IST

ఇంటర్నెట్‌డెస్క్‌:  ప్రభాస్‌ (Prabhas) హీరోగా తెరకెక్కిన ‘సలార్‌’ (Salaar) బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ప్రశాంత్ నీల్‌ దర్శకత్వానికి.. ప్రభాస్‌, పృథ్వీరాజ్‌ల యాక్టింగ్‌కు యాక్షన్‌ ప్రియులు ఫిదా అవుతున్నారు. ఫలితంగా తొలిరోజే భారీ కలెక్షన్లు రాబట్టింది. అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే అదరగొట్టిన ‘సలార్‌’ ప్రపంచవ్యాప్తంగా మొదటిరోజు రూ.175కోట్ల (గ్రాస్‌) వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం ఇండియాలోనే ఓపెనింగ్‌ రోజు రూ.95 కోట్లు సాధించిందని ట్రేడ్‌ వర్గాల సమాచారం. ఇక ఈ వసూళ్లు వీకెండ్‌కు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఒకే సంవత్సరంలో రెండు సినిమాలకు మొదటిరోజే రూ.100కోట్ల కలెక్షన్లు సాధించిన భారతీయ హీరోగా ప్రభాస్‌ రికార్డు సృష్టించాడు.

మాలీవుడ్‌.. లాస్ట్‌ సూపర్‌స్టార్స్‌ అంటూ ప్రశ్న.. మోహన్‌లాల్‌ ఏమన్నారంటే?

ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్‌ 22న విడుదలైంది. ‘కేజీయఫ్‌’ లాంటి భారీ ప్రాజెక్ట్‌ తర్వాత ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో వచ్చిన సినిమా కావడంతో ‘సలార్’పై అంచనాలు నెలకొన్నాయి. అలాగే ఇంటర్వ్యూలో చిత్రబృందం పంచుకున్న విశేషాలతో అవి రెట్టింపయ్యాయి. వాటన్నింటినీ అందుకుని ఈ చిత్రం సూపర్‌హిట్‌గా నిలిచింది. దేవాగా ప్రభాస్‌, వ‌ర‌ద రాజమ‌న్నార్‌గా పృథ్వీరాజ్ సుకుమార‌న్‌ నటన, యాక్షన్‌ సన్నివేశాలు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఎన్నో రోజులుగా హిట్ కోసం ఎదురుచూస్తున్న ప్రభాస్ అభిమానులు ఈ వసూళ్లు చూసి సంబరపడుతున్నారు. కచ్చితంగా రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరుతుందంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని