
Alia Bhatt: అలియాపై రణ్‌బీర్ ఫిర్యాదు.. ప్రెస్మీట్లో చెప్పిన దర్శకుడు
ముంబయి: బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియా భట్, నటుడు రణ్‌బీర్ కపూర్ ఎంతోకాలం నుంచి ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరూ ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నట్లు సమాచారం. కాగా, కొంతకాలం నుంచి అలియా భట్‌పై ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీకి రణ్‌బీర్ ఫిర్యాదులు చేస్తున్నారట. ఈ విషయాన్ని తాజాగా దర్శకుడు భన్సాలీ ఓ ప్రెస్మీట్లో బయటపెట్టారు. ఇంతకీ అలియాపై రణ్‌బీర్ ఫిర్యాదులు చేయడానికి కారణమేంటంటే..
ముంబయి మాఫియా క్వీన్ గంగూబాయి జీవితాన్ని ఆధారంగా చేసుకుని సంజయ్ లీలా భన్సాలీ ‘గంగూబాయి కతియావాడీ’ తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ప్రెస్మీట్లో పాల్గొన్న దర్శకుడు.. అలియాపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమాలో అలియా బాగా నటించిందని.. సినిమా చూశాక అందరూ ఆమెని మెచ్చుకుంటారని ఆయన అన్నారు. ‘‘గంగూబాయి పాత్రలో అలియా ఎంతగానో ఒదిగిపోయింది. ఒదిగిపోయింది అనడం కంటే ఆమె ఆ పాత్రలో జీవించేసింది అనడం ఉత్తమం. నాకు తెలిసినంత వరకూ నిజ జీవితంలోనూ ఆమె.. ఎక్కువ శాతం అలియాలా కాకుండా గంగూబాయిలానే ప్రవర్తిస్తుందట. ఇంట్లో కూడా గంగూబాయిలానే మాట్లాడుతుందని చాలా సార్లు ఆమె ప్రియుడు నాకు ఫిర్యాదు చేశాడు. ఏదైనా ఒక పాత్రలో పూర్తిగా లీనమైనప్పుడే ఇలాంటి జరుగుతుంటాయి’’ అని సంజయ్ తెలిపారు. దర్శకుడి మాటలకు పక్కనే ఉన్న అలియా చిరునవ్వులు చిందించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
India Corona: మళ్లీ పెరిగిన కొత్త కేసులు.. లక్షకు పైగా కరోనా బాధితులు..!
-
General News
Telangana News: కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానా!
-
Movies News
Ram: ఇంట్లో వాళ్లని నమ్మించాల్సి వస్తోంది.. రూమర్స్‌పై రామ్ ట్వీట్
-
Business News
Stock Market: లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు
-
Ap-top-news News
Botsa: అందుకే నాకు భయమేస్తోంది: బొత్స
-
Ap-top-news News
Raghurama: రఘురామను హైదరాబాద్‌లోనే విచారించండి: ఏపీ సీఐడీకి హైకోర్టు ఆదేశం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- తెలంగాణ రుచులు... మళ్లీ మళ్లీ యాదికి రావాలె!
- IND vs ENG: కథ మారింది..!
- బీచ్‌లో కాలక్షేపం కోసం ₹5 లక్షల కోట్ల కంపెనీకి సీఈఓ రాజీనామా!
- 18 కేసుల్లో అభియోగపత్రాలున్న జగన్‌కు లేని ఇబ్బంది నాకెందుకు?
- Allu Arjun: ‘పుష్ప’తో మక్కల్ సెల్వన్ ఢీ.. లెక్కల మాస్టారి స్కెచ్ అదేనా?
- Maharashtra Crisis: సీఎం పదవికి రాజీనామా
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (30-06-2022)
- Udaipur Murder: ‘నన్ను చంపడానికి ప్లాన్.. రక్షించండి’.. హత్యకు ముందు పోలీసులకు దర్జీ ఫిర్యాదు!
- Shivani Rajasekhar: ‘మిస్ ఇండియా’ పోటీ నుంచి తప్పుకున్న శివానీ రాజశేఖర్.. కారణమిదే
- Maharashtra crisis: మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా.. గవర్నర్ ఆమోదం