Satyadev: ఇద్దరు కలిసి...

సత్యదేవ్‌ కథానాయకుడిగా... క్రైమ్‌ యాక్షన్‌  నేపథ్యంలో ఓ చిత్రం రూపొందుతోంది. ఇందులో మరో కథానాయకుడికీ చోటుంది. ‘పెంగ్విన్‌’ ఫేమ్‌ ఈశ్వర్‌ కార్తీక్‌ దర్శకుడు.

Updated : 19 Sep 2022 08:55 IST

త్యదేవ్‌ (Satyadev) కథానాయకుడిగా... క్రైమ్‌ యాక్షన్‌  నేపథ్యంలో ఓ చిత్రం రూపొందుతోంది. ఇందులో మరో కథానాయకుడికీ చోటుంది. ‘పెంగ్విన్‌’ ఫేమ్‌ ఈశ్వర్‌ కార్తీక్‌ (Eashvar Kartic) దర్శకుడు. బాలసుందరం, దినేష్‌ సుందరం నిర్మాతలు. ‘‘నేర నేపథ్యం, యాక్షన్‌ అంశాలతో కూడిన  విభిన్నమైన కథ ఇది. ఇద్దరు కథానాయకులు కలిసి నటిస్తారు. సత్యదేవ్‌ కెరీర్‌లో గుర్తుండిపోతుంది. మరో ప్రధాన పాత్రలో కథానాయకుడు ఎవరన్నది త్వరలోనే ప్రకటిస్తామ’’ని తెలిపాయి సినీ వర్గాలు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: మణికంఠన్‌ కృష్ణమాచారి, సంగీతం: చరణ్‌రాజ్‌, సంభాషణలు: మీరాఖ్‌, కూర్పు: అనిల్‌ క్రిష్‌.


టాప్‌గేర్‌లో ఆది

యాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నారు ఆది సాయికుమార్‌ (Aasi Sai Kumar).  ఆయన కథానాయకుడిగా శశికాంత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘టాప్‌గేర్‌’ (Top Gear). రియా సుమన్‌ కథానాయిక. కె.వి.శ్రీధర్‌ రెడ్డి నిర్మాత. ఆదివారం కథానాయకుడి త్రీడీ మోషన్‌ పోస్టర్‌ని విడుదల చేశారు నిర్మాతలు. ‘‘విభిన్నమైన కథ, కథనాలతో రూపొందుతున్న చిత్రమిది. కథానాయకుడు ఆది లుక్‌, ఆయన నటన ప్రేక్షకులకు కొత్తదనాన్ని పంచుతుంది. త్వరలోనే సినిమాని విడుదల చేస్తాం’’ అన్నారు. బ్రహ్మాజీ, సత్యం రాజేష్‌, మైమ్‌ గోపి, నర్రా, శత్రు, బెనర్జీ, చమ్మక్‌ చంద్ర, హేమంత్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సాయిశ్రీరామ్‌, సంగీతం: హర్షవర్ధన్‌ రామేశ్వర్‌, కూర్పు: ప్రవీణ్‌ పూడి, కళ: రామాంజనేయులు.


అజయ్‌ ప్రేమకథ

‘‘ప్రేమ ఎప్పుడూ సంతోషాన్నే కాదు... అప్పుడప్పుడూ కొన్ని కష్టాల్ని కూడా తెచ్చిపెడుతుంద’’ని  చెబుతున్నాడు ఓ యువకుడు. మరి అతని ప్రేమకథలో ఎన్ని మలుపులున్నాయో తెలియాలంటే ‘అజయ్‌గాడు’ (Ajay Gadu) చూడాల్సిందే. అజయ్‌ కతుర్వార్‌ కథానాయకుడిగా,  టీమ్‌ ఎ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. భానుశ్రీ, శ్వేతా మెహతా కథానాయికలు. అజయ్‌కుమార్‌ ప్రొడక్షన్స్‌, చందన కొప్పిశెట్టి నిర్మాతలు. ఆదివారం ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు. ‘‘ప్రేమ, యాక్షన్‌, రొమాంటిక్‌ అంశాల చుట్టూ సాగే కథ ఇది. అజయ్‌ కతుర్వార్‌, ఇతర నటుల అభినయం అలరిస్తుంది. టీజర్‌ సినిమాపై ఆసక్తిని రేకెత్తించింది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ’’ని చిత్రవర్గాలు తెలిపారు సినిమాకి ఛాయాగ్రహణం: అజయ్‌నాగ్‌, హర్షహరిజాస్తి.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని