Pathaan: ‘పఠాన్’ ఫస్ట్‌లుక్
బాలీవుడ్ కింగ్‌ఖాన్ షారూక్ సినిమాల్లోకి వచ్చి ముప్ఫై ఏళ్లు పూర్తయ్యాయి. 1992లో ‘దీవానా’తో తెరంగేట్రం చేశారు బాద్షా. ఈ సందర్భంగా ‘పఠాన్’ చిత్రవర్గాలు ఫస్ట్‌లుక్, మోషన్ పిక్చర్‌ని విడుదల చేశాయి. సామాజిక మాధ్యమాల ద్వారా షారూక్ వీటిని అభిమానులతో పంచుకున్నారు.
బాలీవుడ్ కింగ్‌ఖాన్ షారూక్(Sharukh Khan) సినిమాల్లోకి వచ్చి ముప్ఫై ఏళ్లు పూర్తయ్యాయి. 1992లో ‘దీవానా’తో తెరంగేట్రం చేశారు బాద్షా. ఈ సందర్భంగా ‘పఠాన్’(Pathaan) చిత్రవర్గాలు ఫస్ట్‌లుక్, మోషన్ పిక్చర్‌ని విడుదల చేశాయి. సామాజిక మాధ్యమాల ద్వారా షారూక్ వీటిని అభిమానులతో పంచుకున్నారు. ‘ముప్ఫై ఏళ్ల ప్రయాణం పూర్తైంది. దీనికన్నా మీరు నాకు పంచిన ప్రేమ, నవ్వులే వెల కట్టలేనివి. ఈ సంతోషాన్ని యశ్‌రాజ్ ఫిల్మ్స్‌తో కలిసి సెలెబ్రేట్ చేసుకుంటున్నా. వచ్చే ఏడాది జనవరి 25న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ‘పఠాన్’గా మీ ముందుకొస్తున్నా’ అనే సందేశాన్ని జోడించారు. ఆ ప్రచార చిత్రంలో తల గాయం నుంచి రక్తం కారుతుండగా.. చేతిలో పొడవాటి గన్ పట్టుకొని ఉంటారు. సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని యశ్‌రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. జాన్ అబ్రహం(John Abraham), దీపికా పదుకొణె(Deepika Padukone) కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఎయిర్ గెశ్చర్స్‌తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు