Manike Mage Hithe: హైదరాబాద్‌లో ‘మాణికే మాగే హితే’ సింగర్‌ ప్రదర్శన

‘మాణికే మాగే హితే..!’. ఈపాట వింటే చాలు మనసంతా రిలాక్సింగ్‌ మూడ్‌లోకి వెళ్లిపోయినట్లు ఉంటుంది. గత కొన్ని నెలలుగా ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తోన్న ఈ పాటని ఆలపించింది  శ్రీలంకలోని కొలంబోకు చెందిన ప్రముఖ పాప్‌ సింగర్‌ యొహాని. మరి ఈపాటను యూట్యూబ్‌లోనే కాదు.. లైవ్‌లో చూడాలనుకునే వారికి ఇదే అవకాశం.

Published : 23 Sep 2021 01:58 IST

ఎప్పుడు, ఎక్కడంటే..

హైదరాబాద్‌: ‘మాణికే మాగే హితే..!’. ఈపాట వింటే చాలు మనసంతా రిలాక్సింగ్‌ మూడ్‌లోకి వెళ్లిపోయినట్లు ఉంటుంది. గత కొన్ని నెలలుగా ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తోన్న ఈ పాటని ఆలపించింది  శ్రీలంకలోని కొలంబోకు చెందిన ప్రముఖ పాప్‌ సింగర్‌ యొహాని. మరి ఈపాటను యూట్యూబ్‌లోనే కాదు.. లైవ్‌లో చూడాలనుకునే వారికి ఇదే అవకాశం. అక్టోబర్‌ 3న (ఆదివారం) హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ‘హార్ట్‌ కప్‌ కాఫీ’లో లైవ్‌ షోలో ‘మాణికే మాగే హితే’తో పాటు మరిన్ని పాటలు ఆలపించేందుకు యొహాని రాబోతున్నారు. 

2021 మే నెలలో ‘మాణికే మాగే హితే’ పాట ఆలపించి సోషల్‌మీడియాను షేక్‌ చేశారు. ఇప్పటివరకూ ఈ పాటను యూట్యూబ్‌లో 119 మిలియన్ల సార్లు వీక్షించారు. ఓ ప్రైవేట్‌ ఆల్బమ్‌గా విడుదలైన పాట...  తమిళం, తెలుగు, బెంగాలీ భాషల్లో రీమేక్‌ అవ్వడం విశేషం.  బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌, నటి మాధురి దీక్షిత్‌ మదిని దోచింది ఈ పాట. ఇన్‌స్టా రీల్స్‌లోనూ ట్రెండింగ్‌గా నిలిచింది.

 



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని