Cinema news: మెగాస్టార్‌కు జోడీగా సోనాక్షి

బాలీవుడ్‌ బ్యూటీ సోనాక్షి సిన్హా మెగాస్టార్‌ చిరంజీవికి జోడీగా నటించనుందా.. త్వరలోనే టాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వనుందా.. అంటే అవుననే అంటున్నాయి.. సినిమా వర్గాలు. ప్రస్తుతం కొరటాల శివతో కలిసి ‘ఆచార్య’ పనుల్లో బిజీగా ఉన్న చిరు.. తన తర్వాతి షెడ్యుల్‌లో డైరెక్టర్‌ బాబీతో కలిసి ఒక సినిమా చేయనున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే ప్రకటించారు.

Published : 23 Jun 2021 22:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ బ్యూటీ సోనాక్షి సిన్హా.. మెగాస్టార్‌ చిరంజీవికి జోడీగా నటించనుందా..? త్వరలోనే టాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వనుందా..? అంటే అవుననే అంటున్నాయి సినిమా వర్గాలు. ప్రస్తుతం కొరటాల శివతో కలిసి ‘ఆచార్య’ పనుల్లో బిజీగా ఉన్న చిరు.. డైరెక్టర్‌ బాబీతో కలిసి ఓ సినిమా చేయనున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే ప్రకటించారు. ఈ చిత్రంలో చిరంజీవి సరసన సందడి చేసేందుకు బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సోనాక్షి సిన్హాను చిత్రబృందం సంప్రదించిందని వార్తలు వినిపిస్తున్నాయి. రెమ్యునరేషన్‌ కూడా బాగానే చెల్లించేందుకు ఒప్పందం జరిగిందట. అయితే, ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకూ వేచి చూడక తప్పదు.

మరోవైపు చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఆచార్య’ విడుదలకు సిద్ధంగా ఉంది. మే 13న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చిరుతో పాటు రామ్‌చరణ్‌ కూడా ఓ కీలక పాత్ర పోషించారు. కాజల్‌ అగర్వాల్‌, పూజా హెగ్డే నటిస్తున్నారు. చిరంజీవి ఈ సినిమా తర్వాత మెహర్ రమేశ్‌ దర్శకత్వంలో ‘వేదాళం’ రీమేక్, డైరెక్టర్‌ మోహన్‌రాజాతో కలిసి ‘లూసిఫర్‌’ రీమేక్‌లో నటించనున్నారు. ఆ తర్వాత బాబీ చిత్రం పట్టాలెక్కే అవకాశాలున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని