సన్నీ లియోనీ.. డిస్టర్బ్ అయింది!
అక్కడకు వచ్చేసరికి సన్నీ కాళ్లకు బ్రేకులు పడ్డాయి..
ఇంటర్నెట్ డెస్క్: బాలీవుడ్ తార సన్నీ లియోనీ షూటింగ్ జరుగుతున్న సెట్లలో సరదాగా సందడి చేయటంలో ముందుంటారనే సంగతి తెలిసిందే. కాగా, ఆమె ప్రస్తుతం ఓ టీవీ కార్యక్రమం వ్యాఖ్యాతగా కూడా వ్యవహరిస్తున్నారు. దీనిలో భాగంగా సన్నీ ఫుడ్ క్రిటిక్ అవతారమెత్తారు. ఒక్కో కౌంటర్ వద్దకు వెళ్లి.. అక్కడున్న పదార్థాన్ని గురించి తనదైన శైలిలో కామెంట్లు చేశారు. ఐతే ఓ డిష్ దగ్గరికి వచ్చేసరికి సన్నీ కాళ్లకు బ్రేకులు పడ్డాయి. పైనాపిల్ పేస్ట్రీ ఉన్న ప్లేటును అమాంతంగా చేతుల్లోకి తీసుకుని ఆనందంతో ‘‘థాంక్యూ సోమచ్..!’’ అంటూ అరిచేశారు. ఆ వెంటనే మళ్లీ వ్యాఖ్యాతగా మారిపోయారు.
ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. ఈ సుందరాంగికి ఈ వంటకం అంటే చాలా ఇష్టంలా ఉందే అని దానిని చూసినవారు అంటున్నారు. ఇక ఆహార పదార్థాలను గురించి సన్నీ చేసిన కామెంట్లు విని.. నవ్వలేక చచ్చామంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. వెండితెరపై హాట్ సీన్లతో కవ్వించే సన్నీ లియోనీ.. నిజజీవితంలో ఫక్తు శాకాహారి. ఇంకా చెప్పాలంటే.. ఆమె జంతు సంబంధ పదార్థాలను కూడా తీసుకోని వీగన్‌గా మారారు. కరెంటు తీగ చిత్రంలో అతిథి పాత్రలోనూ, హీరో రాజశేఖర్ చిత్రం గరుడవేగలో ‘‘డియో డియో’’ అనే ఐటెం సాంగ్‌తో ఆమె తెలుగు ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే.
ఇవీ చదవండి..
బ్రేకప్‌లా ఉంది.. శ్వేతా బసు ప్రసాద్
అబ్బే ఈ సినిమా ఆడదండీ.. అన్నారు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
17మంది రోగులను హత్య చేసిన నర్సు..700 ఏళ్ల జైలు శిక్ష
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన రోహిత్ వేముల తల్లి..
-
కొత్త సినిమా ప్రకటించిన విజయ్ దేవరకొండ.. డైరెక్టర్ ఎవరంటే!
-
10 వేలమంది అనుచరులు.. 700 వాహనాలు: కుమారుడి నామినేషన్ వేళ బ్రిజ్‌భూషణ్ హడావుడి
-
రోహిత్‌కు ఏమైంది? ఇంపాక్ట్ ప్లేయర్‌గా రావడానికి కారణమిదే!