Published : 07/12/2021 02:07 IST

Kamal Hasan: కమల్‌ హాసన్‌కు తమిళనాడు ఆరోగ్యశాఖ నోటీసులు..?

ఇంటర్నెట్‌ డెస్క్‌: విశ్వనటుడు కమల్‌ హాసన్‌కు తమిళనాడు రాష్ట్ర ఆరోగ్యశాఖ నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమైంది. ఆయన కరోనా నిబంధనలు ఉల్లంఘించడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఇంతకీ ఏమైందంటే..

కమల్‌ హాసన్‌కు గత నెలలో కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఆయన ఆస్పత్రిలో చేరారు. రెండు రోజుల కిందట కరోనా నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. అయితే, కరోనా నిబంధనల ప్రకారం.. మహామ్మారి నుంచి కోలుకున్నా ఇంట్లో కనీసం వారం రోజులు ఐసోలేషన్‌లో ఉండాలి. కానీ, కమల్‌.. కరోనా నిబంధనలు ఉల్లంఘించి బిగ్‌బాస్‌ షో షూటింగ్‌లో పాల్గొన్నారు. తమిళ వెర్షన్‌ బిగ్‌బాస్‌కు కమల్‌ వ్యాఖ్యాత వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. దీంతో బిగ్‌బాస్‌ వీకెండ్‌ స్పెషల్‌ షో కోసం ఆయన ఆస్పత్రి నుంచి నేరుగా షూటింగ్‌కి వెళ్లారు.

కరోనా నుంచి కోలుకున్న వెంటనే కమల్‌ హాసన్‌ బిగ్‌బాస్‌ షూటింగ్‌లో పాల్గొనడంపై తమిళనాడు ఆరోగ్యశాఖ సీరియస్‌ అయింది. కరోనా నిబంధనలు ఉల్లంఘించి షూటింగ్‌ చేయడం సరికాదని, ఈ చర్యపై తక్షణమే వివరణ ఇవ్వాలని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ నోటీసులు జారీ చేయనుంది.

Read latest Cinema News and Telugu News

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని