Allu arjun: అల్లూ వారి విల్లుకు.. తెలుగు వారి బాకీ చెల్లు: తనికెళ్ల భరణి

అల్లు అర్జున్‌కు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు వచ్చినందుకు నటుడు తనికెళ్ల భరణి అభినందించారు. తనదైన శైలిలో చిన్న కవిత చెప్పి ఆకట్టుకున్నారు.  

Updated : 26 Aug 2023 13:32 IST

హైదరాబాద్‌: టాలీవుడ్‌లో చరిత్ర సృష్టిస్తూ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ (Allu arjun) జాతీయ అవార్డును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఆయనకు రెండు రోజుల నుంచి ప్రశంసలు , శుభాకాంక్షలు వెల్లు వెత్తుతున్నాయి. ఇప్పటికే పలువురు ప్రముఖులు అభినందనలు తెలుపగా.. తాజాగా నటుడు తనికెళ్ల భరణి (Tanikella Bharani) తనదైన శైలిలో అల్లు అర్జున్‌కు విషెస్‌ చెప్పారు.

‘తగ్గక్కర్లా..’అంటూ ఓ వీడియోను పోస్ట్‌ చేసిన తనికెళ్ల భరణి ..‘అర్జునుడై గురిపెట్టెను అల్లూ తన విల్లు.. శతాబ్దాల తెలుగు వాళ్ల బాకీ ఇక చెల్లు’ అంటూ చిన్న కవిత రూపంలో అల్లు అర్జున్‌కు అభినందనలు తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో అందరినీ ఆకర్షిస్తోంది. చాలా బాగా చెప్పారంటూ నెటిజన్లు కామెంట్స్‌ పెడుతున్నారు. ఇక మరోవైపు తనకు శుభాకాంక్షలు చెప్పిన వారందరికీ అల్లు అర్జున్ రిప్లై ఇస్తూ ధన్యవాదాలు చెబుతున్నారు.

సరికొత్త రికార్డు సృష్టించిన ‘జైలర్‌’.. తొలి ఇండియన్ సినిమాగా..

ఈ సందర్భంగా బన్నీని రామ్ చరణ్‌ (Ram charan), ఉపాసనలు (Upasana) ప్రత్యేకంగా అభినందించారు. అల్లు అర్జున్‌ ఇంటికి ఓ పుష్పగుచ్ఛాన్ని పంపిన రామ్ చరణ్‌ దంపతులు ఒక స్పెషల్‌ నోట్‌ను రాశారు. ‘‘నిన్ను చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది. నీకు ఇలాంటి ఎన్నో అవార్డులు రావాలి. వీటన్నింటికీ అర్హుడివి. కంగ్రాట్స్’’ అని ఆ నోట్‌లో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోను అల్లు అర్జున్‌ తన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్‌ చేస్తూ.. ‘మీ అభినందనలు మనసుకు హత్తుకున్నాయి’ అని రాశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని