Naga Chaitanya: మరో కథ నచ్చింది

ఓ వైపు   తెలుగులో ‘థ్యాంక్‌ యూ’, ‘బంగార్రాజు’ చేస్తూనే.. మరోవైపు  బాలీవుడ్‌లో ‘లాల్‌ సింగ్‌ చద్దా’లోనూ నటిస్తున్నారు కథానాయకుడు నాగచైతన్య. వీటితో పాటు దర్శకుడు విక్రమ్‌

Published : 25 Oct 2021 14:46 IST

వైపు   తెలుగులో ‘థ్యాంక్‌ యూ’, ‘బంగార్రాజు’ చేస్తూనే.. మరోవైపు  బాలీవుడ్‌లో ‘లాల్‌ సింగ్‌ చద్దా’లోనూ నటిస్తున్నారు కథానాయకుడు నాగచైతన్య. వీటితో పాటు దర్శకుడు విక్రమ్‌ కె.కుమార్‌తోనూ ఓ వెబ్‌సిరీస్‌ చేసేందుకు ప్రణాళిక రచిస్తున్నారు. అయితే ఇప్పుడాయన మరో కొత్త ప్రాజెక్ట్‌కు పచ్చజెండా ఊపినట్లు తెలిసింది. దీనికి నందిని రెడ్డి దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. ఆమె ఇటీవలే చైతూకు ఓ కథ వినిపించిందని, అది ఆయనకి నచ్చడంతో సినిమాకి ఓకే చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీన్ని  వైజయంతి మూవీస్‌ సంస్థ నిర్మించనున్నట్లు సమాచారం. నందిని ప్రస్తుతం సంతోష్‌ శోభన్‌తో ‘అన్నీ మంచి శకునములే’ అనే సినిమా చేస్తోంది. ఇది పూర్తికాగానే చైతూ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. ఈలోపు చైతన్య తన చేతిలో ఉన్న సినిమాల్ని పూర్తి చేయనున్నాడు. ప్రస్తుతం ఆయన కోసం కథలు సిద్ధం చేసుకుంటున్న దర్శకుల జాబితాలో ఇంద్రగంటి మోహనకృష్ణ, విజయ్‌ కనకమేడల పేర్లు వినిపిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని