Aamani: అందగత్తెను కాదని ఎగతాళి చేశారు: ఆమని

ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే తరుణంలో కుటుంబసభ్యులు.. ముఖ్యంగా బంధువుల నుంచి తాను ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నానని అలనాటి నటి ఆమని తెలిపారు. కెరీర్‌ ఆరంభంలోనే ‘జంబలకిడిపంబ’...

Updated : 24 Aug 2021 15:03 IST

హైదరాబాద్‌: ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే సమయంలో కుటుంబసభ్యులు.. ముఖ్యంగా బంధువుల నుంచి తాను ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నానని అలనాటి నటి ఆమని అన్నారు. కెరీర్‌ ఆరంభంలోనే ‘జంబలకిడిపంబ’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఆమె ‘మిస్టర్‌ పెళ్లాం’, ‘శుభలగ్నం’, ‘అమ్మదొంగ’ వంటి ఎన్నో చిత్రాలతో మెప్పించారు. ప్రస్తుతం ఆమె సహాయ నటి పాత్రలు పోషిస్తూ మరోవైపు ధారావాహికల్లోనూ నటిస్తున్నారు. తాజాగా ఆమె తన స్నేహితురాలు, నటి ఇంద్రజతో కలిసి ‘ఆలీతో సరదాగా’లో సందడి చేశారు.

ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమవుతున్న సెలబ్రిటీ ట్‌ షో ‘ఆలీతో సరదాగా’. తాజాగా ఈ ప్రోగ్రామ్‌లో ఇంద్రజ, ఆమని ఎన్నో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఐదేళ్ల వయసు నుంచే తనకి సినిమాలు అంటే ఇష్టమని.. స్కూల్‌లో చదవడం మానేసి శ్రీదేవి, జయప్రద, జయసుధల గురించే ఎక్కువగా ఆలోచించేదాన్ని అని ఆమని తెలిపారు. దొంగిలించిన మామిడికాయలు తినడమంటే తనకెంతో ఇష్టమన్నారు. అనంతరం తన కెరీర్‌ గురించి మాట్లాడుతూ.. ‘‘సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నాక.. మా కుటుంబానికి ఆ విషయం చెప్పాను. మా బంధువులందరూ విమర్శించారు. ‘అది సినిమాల్లో చేయడమేమిటి?ఎవరితోనూ సరిగ్గా మాట్లాడదు, పెద్ద అందగత్తె ఏం కాదు’’ అని అన్నారని ఆమని తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని