Aishwarya Rai: ఈడీ విచారణకు హాజరైన ఐశ్వర్యరాయ్‌

పనామా పేపర్ల లీకేజీ వ్యవహారంలో సోమవారం ప్రముఖ నటి ఐశ్వర్యరాయ్.. దిల్లీలోని ఈడీ అధికారుల ముందు హాజరయ్యారు. అధికారులు ఆమెను విచారించి, స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసినట్లు సంబంధించి వర్గాలు వెల్లడించాయి.

Published : 20 Dec 2021 16:17 IST

దిల్లీ: పనామా పేపర్ల లీకేజీ వ్యవహారంలో సోమవారం ప్రముఖ నటి ఐశ్వర్యరాయ్.. దిల్లీలోని ఈడీ అధికారుల ముందు హాజరయ్యారు. అధికారులు ఆమెను విచారించి, స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసినట్లు సంబంధించి వర్గాలు వెల్లడించాయి. ఈ రోజు ఉదయం ఈడీ ముందు హాజరు కావాలంటూ ఆమెకు సమన్లు జారీ చేయగా.. ఇవాళ హాజరు కాలేనని  ఐశ్వర్య అధికారులకు సమాచారం ఇచ్చారు. అనంతరం అకస్మాత్తుగా ఈడీ కార్యాలయం ముందు ప్రత్యక్షమయ్యారు. ఈ విచారణ విషయమై గతంలోనే సమన్లు జారీ చేయగా.. అప్పట్లో ఆమె వాయిదా కోరారు.

పనామా దేశానికి చెందిన మొసాక్‌ ఫోన్సెకా అనే కార్పొరేట్‌, న్యాయ సేవల సంస్థ పలు దేశాల్లో నెలకొల్పిన వేలాది డొల్ల కంపెనీల బాగోతాన్ని 2016లో ఐసీఐజే బట్టబయలు చేసింది. ఇది పలువురు ప్రముఖులపై కేసుల నమోదుకు దారితీసింది. 136 కోట్ల డాలర్ల అక్రమ ధనాన్ని అధికారులు స్వాధీనం చేసుకునేలా చేసింది. పలు దేశాలకు చెందిన రాజకీయ నాయకులు, కార్పొరేట్‌ అధిపతులు, సినీరంగానికి చెందిన వారు అక్రమ ధనాన్ని రహస్య ఖాతాల్లోకి మళ్ళించడానికి తోడ్పడే సంస్థ గుట్టు బయటపడింది.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని