Published : 21/11/2021 15:09 IST

Gamanam: థియేటర్లలోనే ‘గమనం’.. విడుదల ఎప్పుడంటే? 

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొవిడ్‌ లాక్‌డౌన్‌ కారణంగా విడుదల వాయిదా పడిన చిత్రాల్లో ‘గమనం’ ఒకటి. ప్రస్తుతం పరిస్థితులు మెరుగుపడటంతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది. సామాజిక మాధ్యమాల వేదికగా విడుదల తేదీని ఖరారు చేస్తూ చిత్ర బృందం ఓ పోస్టర్‌ని పంచుకుంది. ‘‘గమనం’ డిసెంబరు 10న.. కేవలం థియేటర్లలోనే’ అని పేర్కొంది. ఈ సినిమాలో శ్రియ, ప్రియాంక జవాల్కర్‌, శివ కందుకూరి, నిత్యామేనన్‌ ప్రధాన పాత్రలు పోషించారు. పలు ఉపకథల సమ్మేళనంగా సుజనా రావు తెరకెక్కించారు. రమేష్‌ కరుటూరి, వెంకీ పుషదపు, జ్ఞానశేఖర్‌ వి.ఎస్‌ నిర్మించారు. ఇళయరాజా స్వరాలందించారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదలకానుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ట్రైలర్‌కు విశేష స్పందన లభించింది.


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని