KGF: ‘కె.జి.యఫ్‌ ఛాప్టర్‌ 2’ సందడి వచ్చే ఏడాదే..!

పరిస్థితులు బాగుంటే ఇప్పటికే సందడి చేయాల్సిన చిత్రాల్లో ‘కె.జి.యఫ్‌ ఛాప్టర్‌ 2’ ఒకటి. జులై 16న విడుదల కావాల్సిన ఈ సినిమా కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ కారణంగా వాయిదా పడింది. మళ్లీ ఈ చిత్ర విడుదల ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు శుభవార్త అందింది. కొత్త విడుదల తేదీని చిత్రబృందం తాజాగా ప్రకటించింది. 2022 ఏప్రిల్‌ 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు వెల్లడించింది.

Published : 22 Aug 2021 17:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పరిస్థితులు బాగుంటే ఇప్పటికే సందడి చేయాల్సిన చిత్రాల్లో ‘కె.జి.యఫ్‌ ఛాప్టర్‌ 2’ ఒకటి. జులై 16న విడుదల కావాల్సిన ఈ సినిమా కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ కారణంగా వాయిదా పడింది. మళ్లీ ఈ చిత్ర విడుదల ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు శుభవార్త అందింది. కొత్త విడుదల తేదీని చిత్రబృందం తాజాగా ప్రకటించింది. 2022 ఏప్రిల్‌ 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు వెల్లడించింది. యశ్ హీరోగా పాన్‌ ఇండియా స్థాయిలో దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ రూపొందిస్తున్న సినిమా ఇది. శ్రీనిధి శెట్టి కథానాయిక. ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్‌  పతాకంపై విజయ్‌ కిరంగదూర్‌  నిర్మిస్తున్నారు. సంజయ్‌దత్‌, రవీనా టాండన్‌, రావు రమేశ్‌ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. గతంలో వచ్చిన ‘కె.జి.యఫ్‌ ఛాప్టర్‌ 1’కి కొనసాగింపుగా రూపొందుతోంది. విడుదలైన అన్ని భాషల్లోనూ ‘ఛాప్టర్ 1’ ఘన విజయం అందుకోవడంతో ‘ఛాప్టర్‌ 2’పై భారీ అంచనాలు ఉన్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని