19న డైరెక్టర్స్‌ డే వేడుకలు

‘‘‘దర్శకులకే కాకుండా... సినీ  పరిశ్రమలోని కార్మికుల్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా పరిష్కరించేందుకు చొరవ చూపిన పరిశ్రమ పెద్ద దిక్కు దాసరి నారాయణరావు. ఆయన సేవలు ఎప్పటికీ గుర్తుంటాయి’’ అన్నారు తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్‌.

Updated : 05 May 2024 09:56 IST

‘‘‘దర్శకులకే కాకుండా... సినీ  పరిశ్రమలోని కార్మికుల్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా పరిష్కరించేందుకు చొరవ చూపిన పరిశ్రమ పెద్ద దిక్కు దాసరి నారాయణరావు. ఆయన సేవలు ఎప్పటికీ గుర్తుంటాయి’’ అన్నారు తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్‌. డైరెక్టర్స్‌ డే వేడుకల్ని ఈ నెల 19న హైదరాబాద్‌లో ఎల్బీ స్టేడియంలో నిర్వహించాలని నిర్ణయించినట్టు ఆయన తెలిపారు.  ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు జయంతి వేడుకల్ని తెలుగు సినిమా దర్శకుల సంఘం శనివారం హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించింది. ఇదే వేదికపై ఈ నెల 19న జరగనున్న డైరెక్టర్స్‌ డే ఉత్సవాలకి సంబంధించిన పోస్టర్‌ని విడుదల చేశారు. సినీ ప్రముఖులు తమ్మారెడ్డి భరద్వాజ, రేలంగి నరసింహారావు, దామోదర్‌ ప్రసాద్‌, టి.ప్రసన్నకుమార్‌, సి.కల్యాణ్‌, అనిల్‌ కుమార్‌ వల్లభనేనితోపాటు, దర్శకులు శంకర్‌, మెహర్‌ రమేశ్‌, అనిల్‌ రావిపూడి, గోపీచంద్‌ మలినేని, వశిష్ఠ, విజయ్‌ కనకమేడల, రామ్‌ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. దాసరి నారాయణరావు చిత్ర పరిశ్రమకి, దర్శకుల సంఘానికి చేసిన సేవల్ని గుర్తు చేసుకున్నారు. డైరెక్టర్స్‌ డే వేడుకల్ని అందరి సహకారంతో ఘనంగా నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాజ సూర్యనారాయణ, అనుపమ్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని