MAA Elections: ‘మా’ అధ్యక్షుడిగా విష్ణు ప్రమాణస్వీకారం.. హాజరవ్వని ప్రకాశ్‌రాజ్
హోరాహోరీగా సాగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో విజయం సాధించి నూతన ‘మా’ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు నటుడు మంచు విష్ణు.
హైదరాబాద్: హోరాహోరీగా సాగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో విజయం సాధించి నూతన ‘మా’ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు నటుడు మంచు విష్ణు. ఈ మేరకు ఎన్నికల అధికారి కృష్ణమోహన్ సమక్షంలో శనివారం ఉదయం ‘మా’ నూతన అధ్యక్షుడిగా విష్ణు ప్రమాణస్వీకారం చేశారు. విష్ణుతో పాటు ఆయన ప్యానెల్ నుంచి గెలుపొందిన 15 సభ్యులూ ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. దీంతో, ‘మా’లో నూతన కార్యవర్గం కొలువుదీరింది.
ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్లో నిర్వహించిన ఈ ప్రమాణస్వీకారోత్సవానికి తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. పలువురు సినీ ప్రముఖులు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొని.. కొత్త కార్యవర్గానికి అభినందనలు తెలిపారు. మరోవైపు ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు ‘మా’ కార్యాలయంలో విష్ణు తన కార్యవర్గ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విష్ణుకి మద్దతుగా ఉన్న నరేశ్ సైతం ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
హాజరుకాని ప్రకాశ్‌రాజ్ ప్యానెల్..
‘మా’ ఎన్నికలు తెరపైకి వచ్చిన నాటి నుంచి మంచు విష్ణు, ప్రకాశ్‌రాజ్ ప్యానెల్స్ మధ్య మాటల దాడి జరిగిన విషయం తెలిసిందే. ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ నుంచి 11 మంది విజయం సాధించినప్పటికీ.. కొన్ని కారణాల వల్ల విష్ణు ప్యానెల్ సభ్యులతో కలిసి పనిచేయలేమంటూ తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ క్రమంలో తాజాగా జరిగిన ‘మా’ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారానికి ప్రకాశ్‌రాజ్, అతని ప్యానెల్ సభ్యులెవరూ హాజరు కాలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్‌డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘పుష్ప’ కేశవ రోల్‌కు సుహాస్‌ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
‘ప్రసన్నవదనం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు దర్శకుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ వేదికపై సుహాస్ గురించి ఆసక్తికర విషయం చెప్పారు. -
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
కియారా అడ్వాణీ ఓ పాన్ ఇండియా చిత్రంలో కీలక పాత్ర పోషించనుందంటూ ప్రచారం జరిగింది. అది రూమరే అని స్పష్టత వచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
విరాట్ - హార్దిక్‌కు నో ఛాన్స్.. ఈ లఖ్‌నవూ స్టార్‌కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్‌డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్‌కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్‌కు సుహాస్‌ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
బైక్‌పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!