Naga Chaitanya: సంతోష చైతన్యం

‘‘ఉత్సాహం ఉరకలేస్తున్నపుడు... మనసు గుర్రమెక్కి ఆకాశాన్ని అందుకోవాలనుంటుంది’’ నాగచైతన్య సంతోషం చూస్తే అలాగే కనిపిస్తోంది కదూ? రాశీఖన్నా, అవికాగోర్‌, మాళవికా నాయర్‌లతో కలిసి ఆయన ఆడిపాడినున్న చిత్రం ‘థాంక్యూ’. విక్రమ్‌ కె.కుమార్‌ తెరకెక్కిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు, శిరీష్‌ నిర్మిస్తున్నారు. మంగళవారం చైతు పుట్టినరోజు సందర్భంగా ‘థాంక్యూ’ నుంచి  ఫస్ట్‌లుక్‌ విడుదల చేశారు.

Updated : 24 Nov 2021 08:06 IST

‘‘ఉత్సాహం ఉరకలేస్తున్నపుడు... మనసు గుర్రమెక్కి ఆకాశాన్ని అందుకోవాలనుంటుంది’’ నాగచైతన్య సంతోషం చూస్తే అలాగే కనిపిస్తోంది కదూ? రాశీఖన్నా, అవికాగోర్‌, మాళవికా నాయర్‌లతో కలిసి ఆయన ఆడిపాడినున్న చిత్రం ‘థాంక్యూ’. విక్రమ్‌ కె.కుమార్‌ తెరకెక్కిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు, శిరీష్‌ నిర్మిస్తున్నారు. మంగళవారం చైతు పుట్టినరోజు సందర్భంగా ‘థాంక్యూ’ నుంచి  ఫస్ట్‌లుక్‌ విడుదల చేశారు. ఓ జాతరలో రంగులరాట్నం ఎక్కి సంతోషంతో కేకలు వేస్తున్న నాగచైతన్యను ఈ లుక్‌లో చూపించారు. చైతు కళ్లజోడు, గడ్డెంతో కొత్తగా కనిపించారు. ‘‘నాగచైతన్య ఎప్పుడూ చేయని భిన్నమైన పాత్ర ఇందులో పోషిస్తున్నారు. ఆయనలోని మరో కోణాన్ని ఆవిష్కరించే చిత్రమవుతుంది. ఇప్పటికే షూటింగ్‌ దాదాపు ముగిసింది. త్వరలోనే మరిన్ని వివరాలు తెలియజేస్తామ’’న్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి పీసీ శ్రీరామ్‌ ఛాయాగ్రాహకుడు కాగా, తమన్‌ స్వరాలందిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని