Rajinikanth - Peddanna: నలుగురు నాయికలతో రజనీకాంత్‌ హంగామా.. ‘పెద్దన్న’ ట్రైలర్‌ అదిరింది!

రజనీకాంత్‌ హీరోగా తెరకెక్కుతోన్న తమిళ చిత్రం ‘అన్నాత్తే’. తెలుగులో ‘పెద్దన్న’ పేరుతో విడుదలవుతుంది. శివ దర్శకత్వం వహిస్తోన్న ఈ  సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకురానుంది.

Updated : 27 Oct 2021 19:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్: రజనీకాంత్‌ (Rajinikanth) హీరోగా తెరకెక్కుతున్న తమిళ చిత్రం ‘అన్నాత్తే’ (Annathe). తెలుగులో ‘పెద్దన్న’ (Peddanna) పేరుతో విడుదల కానుంది. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ  సినిమా దీపావళి కానుకగా నవంబరు 4న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ట్రైలర్‌ (Peddanna Trailer)ని విడుదలచేసింది. రజనీకాంత్‌ అభిమానులు కోరుకునే యాక్షన్‌, కామెడీ.. ఇలా అన్ని అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందించినట్టు ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతుంది. రజనీకాంత్‌ స్టైల్, సంభాషణలు మెప్పిస్తున్నాయి. రజనీకాంత్‌ సోదరిగా కీర్తి సురేశ్‌ (Keerthy Suresh) అందరినీ ఆకట్టుకునేలా ఉంది. రజనీకి జోడీగా నయనతార (Nayanatara) మెరిసింది. మీనా, ఖుష్బూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకి సంగీతం: డి. ఇమ్మాన్‌, ఛాయాగ్రహణం: వెట్రి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని