Updated : 23 Sep 2021 10:57 IST

Anubhavinchu Raja: నవ్వులు పూయించేలా ‘అనుభవించు రాజా’ టీజర్‌

హైదరాబాద్‌: రాజ్‌తరుణ్‌ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న సరికొత్త చిత్రం ‘అనుభవించు రాజా’. శ్రీను గావిరెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టీజర్‌ను గురువారం ఉదయం మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ సోషల్‌మీడియా వేదికగా విడుదల చేశారు. ఉభయ గోదావరి జిల్లాల నేపథ్యంలో సాగే ఓ యూత్‌ఫుల్‌ లవ్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో రాజ్‌తరుణ్‌ కోడిపందెలు అంటే ఆసక్తి కనబరిచే బంగారం అనే యువకుడి పాత్రలో కనిపించనున్నారు. ‘బంగారం గాడు ఊర్లోని.. వాడి పుంజు బరిలోని ఉండగా.. ఇంకొండు గెలవడం కష్టమెహే’ అంటూ ఆయన చెప్పే డైలాగ్‌లు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇందులో రాజ్‌తరుణ్‌ సరసన కషికా ఖాన్‌ సందడి చేయనున్నారు. పోసాని కృష్ణ మురళీ, అజయ్‌, సుదర్శన్‌, టెంపర్‌ వంశీ కీలకపాత్రలు పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్‌, శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. గోపీ సుందర్‌ స్వరాలు అందిస్తున్నారు.


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts