Sudheer Babu: రామోజీ ఫిల్మ్‌సిటీలో సుధీర్‌బాబు.. యాక్షన్‌ షురూ

సుధీర్‌బాబు కథానాయకుడిగా హర్ష వర్ధన్‌ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నారాయణ్‌ దాస్‌.కె నారంగ్‌, పుస్కూర్‌ రామ్‌ మోహన్‌రావు నిర్మిస్తున్నారు. చైతన్‌ భరద్వాజ్‌ స్వరాలందిస్తున్నారు. ఇటీవలే పూజా కార్యక్రమాలతో లాంఛనంగామొదలైన

Updated : 28 Dec 2021 06:16 IST

సుధీర్‌బాబు కథానాయకుడిగా హర్ష వర్ధన్‌ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నారాయణ్‌ దాస్‌.కె నారంగ్‌, పుస్కూర్‌ రామ్‌ మోహన్‌రావు నిర్మిస్తున్నారు. చైతన్‌ భరద్వాజ్‌ స్వరాలందిస్తున్నారు. ఇటీవలే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైన ఈ సినిమా రెగ్యులర్‌ చిత్రీకరణ సోమవారం నుంచి రామోజీ ఫిల్మ్‌ సిటీలో ప్రారంభమైంది. ఈ విషయాన్ని చిత్ర బృందం సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేసింది. ఈ సందర్భంగా సెట్లోని ఓ వర్కింగ్‌ స్టిల్‌ను విడుదల చేశారు. ఇందులో సుధీర్‌బాబు ఓ సరికొత్త లుక్‌తో ఆకట్టుకునేలా కనిపించారు. తొలి షెడ్యూల్‌లో భాగంగా ప్రస్తుతం సుధీర్‌తో పాటు మిగిలిన ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ‘‘సుధీర్‌ నటిస్తున్న 15వ చిత్రమిది. ఇందులో ఆయన సవాల్‌తో కూడిన పాత్ర చేస్తున్నారు. విభిన్నమైన కథతో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాని ముస్తాబు చేస్తున్నామ’’న్నారు చిత్ర నిర్మాతలు.ఈ సినిమాకి కళ: రాజీవ్‌, ఛాయాగ్రహణం: పీజీ విందా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని