Manchu Vishnu: వారం రోజుల్లో ‘మా’ భవనంపై నిర్ణయం

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) భవన నిర్మాణం గురించి మరో వారం రోజుల్లో ప్రకటన చేస్తామన్నారు ‘మా’ అధ్యక్షుడు, కథానాయకుడు మంచు విష్ణు. ప్రస్తుతం అందుకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయని ఆయన ...

Updated : 13 Dec 2021 06:58 IST

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) భవన నిర్మాణం గురించి మరో వారం రోజుల్లో ప్రకటన చేస్తామన్నారు ‘మా’ అధ్యక్షుడు, కథానాయకుడు మంచు విష్ణు. ప్రస్తుతం అందుకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఆదివారం ‘మా’ ఆధ్వర్యంలో సభ్యులకి ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మంచు విష్ణు మాట్లాడుతూ ‘‘ఏటా డిసెంబర్‌ రెండో వారంలో మా సభ్యుల కోసం ఉచిత ఆరోగ్య పరీక్షల శిబిరాన్ని నిర్వహిస్తాం. మెడికవర్‌ ఆస్పత్రి, మా అసోసియేషన్‌ ఆధ్వర్యంలో అన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తార’’ని తెలిపారు.

రాజీనామాలు ఆమోదం  
‘మా’ ఎన్నికల్లో ప్రకాష్‌రాజ్‌ ప్యానల్‌ నుంచి పోటీ చేసి గెలుపొందిన 11 మంది సభ్యుల రాజీనామాల్ని ఆమోదించినట్టు ఈ సందర్భంగా మంచు విష్ణు తెలిపారు. ‘‘రాజీనామాలు వెనక్కి తీసుకోవల్సింది కోరాను. కానీ వారు అందుకు సిద్ధపడలేదు. నెల రోజులు చూశాక రాజీనామాల్ని ఆమోదించాం. ‘మా’ పనుల కోసం వారి స్థానంలో కొత్త సభ్యుల్ని తీసుకున్నాం. అయితే వారు పదవులకి రాజీనామా చేసినా, ‘మా’ సభ్యులుగా కొనసాగుతారు. నాగబాబు, ప్రకాష్‌రాజ్‌ ‘మా’ సభ్యులుగా కొనసాగుతార’’న్నారు. ఈ కార్యక్రమంలో మా ఉపాధ్యక్షుడు మాదాల రవి, ప్రధాన కార్యదర్శి రఘుబాబు, కోశాధికారి శివబాలాజీ, డా.అనిల్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని