Nagarjuna: భాగ్యనగరంలో ‘ది ఘోస్ట్‌’

నాగార్జున - ప్రవీణ్‌ సత్తారు కలయికలో తెరకెక్కుతోన్న యాక్షన్‌ చిత్రం ‘ది ఘోస్ట్‌’. నారాయణ్‌ దాస్‌ నారంగ్‌, పుస్కూర్‌ రామ్‌ మోహన్‌రావు, శరత్‌ మరార్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సోనాల్‌ చౌహాన్‌

Updated : 11 May 2022 08:42 IST

నాగార్జున - ప్రవీణ్‌ సత్తారు కలయికలో తెరకెక్కుతోన్న యాక్షన్‌ చిత్రం ‘ది ఘోస్ట్‌’. నారాయణ్‌ దాస్‌ నారంగ్‌, పుస్కూర్‌ రామ్‌ మోహన్‌రావు, శరత్‌ మరార్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సోనాల్‌ చౌహాన్‌ కథానాయిక. ఈ సినిమాని ఇప్పటికే దుబాయ్‌, గోవా, ఊటీలలో 66 రోజుల పాటు చిత్రీకరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆఖరి షెడ్యూల్‌ ప్రారంభించేందుకు చిత్ర బృందం సిద్ధమైంది. ఈ షెడ్యూల్‌ను ఈనెల 12నుంచి హైదరాబాద్‌లో ప్రారంభించనున్నారని సమాచారం. ఇందులో భాగంగా నాగార్జునపై పలు కీలక సన్నివేశాలతో పాటు క్లైమాక్స్‌ ఫైట్‌ను చిత్రీకరించనున్నట్లు తెలిసింది. నెలాఖరు నాటికి సినిమాని పూర్తి చేయనున్నారని టాక్‌. త్వరలో టీజర్‌ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ‘‘ఆసక్తి రేకెత్తించే కథతో విభిన్నమైన యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని ముస్తాబు చేస్తున్నారు. ఇందులో నాగ్‌, సోనాల్‌ ఇంటర్‌పోల్‌ ఆఫీసర్స్‌గా కనిపించనున్నారు’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి యాక్షన్‌: దినేష్‌ సుబ్బరాయన్‌, కేచ్‌, ఛాయాగ్రహణం: ముఖేష్‌ జి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని