Tiger Shroff: అల్లుఅర్జున్‌ అంటే ఇష్టమంటున్న ప్రముఖ బాలీవుడ్‌ నటుడు...

మెగా హీరోగా సినిమా రంగంలోకి ప్రవేశించిన అల్లుఅర్జున్‌. ఎంట్రీ ఇచ్చిన కొద్ది కాలంలోనే తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు.

Published : 25 Sep 2022 11:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌:  ప్రముఖ నటుడు అల్లుఅర్జున్‌కు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా ఫ్యాన్‌ఫాలోయింగ్‌ ఉంది. ఈ ఐకాన్‌స్టార్‌ అభిమానుల జాబితాలోని సెలబ్రిటీల సంఖ్య తక్కువేం కాదు. తాజాగా ఓ బాలీవుడ్ నటుడు తనకు అల్లుఅర్జున్‌ అంటే ఇష్టమంటూ ప్రకటించాడు.  అతడు ఏవరో కాదు.. బాలీవుడ్ యాక్షన్‌ హీరో ‘టైగర్‌ ష్రాఫ్‌’. వైవిధ్యభరితమైన యాక్షన్‌ కథలతో అభిమానులను అలరించే ఈ యువ హీరో ఇటీవల తన అభిమానులతో ఇన్‌స్టా వేదికగా ముచ్చటించారు. ఈ సందర్భంగా ఓ అభిమాని ‘మీకు ఇష్టమైన దక్షిణాది నటుడు ఎవరు’ అని ప్రశ్నించగా.. ఆ ప్రశ్నకు ష్రాఫ్‌ ‘ఐకాన్‌ స్టార్‌ అల్లుఅర్జున్‌’ అంటూ బదులిచ్చారు. ఈ విషయాన్ని తన ఇన్‌స్టా స్టోరీలో అతడు పోస్ట్‌ చేయగా అది వైరల్‌గా మారింది. 

ప్రస్తుతం అల్లుఅర్జున్‌ పుష్ప (ది-రూల్‌)పై దృష్టి పెట్టారు. సుకుమార్‌ దర్శకత్వంలో ఈ సినిమా రానుంది. మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై రూపుదిద్దుకొంటోన్న ఈ సినిమా రెగ్యులర్‌ షూట్‌ త్వరలోనే ప్రారంభంకానుంది. ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కిన పుష్ప (ది-రైజ్‌)కు కొనసాగింపుగా ఇది సిద్ధం అవుతోంది. 

 

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts