Social Look: బార్బీ బొమ్మగా పూజా.. మంచి రోజులొస్తాయన్న సామ్‌..

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు..

Published : 06 Aug 2023 02:21 IST
  • నటి పూజాహెగ్డే (Pooja Hegde) తాజాగా ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. పింక్‌ కలర్‌ స్టైలిష్‌ దుస్తులు ధరించి బార్బీ బొమ్మలా ఆమె హొయలొలికించారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాలో షేర్‌ చేసిన ఆమె ‘‘ఈ బార్బీ మేజిక్‌ను నమ్ముతుంది’’ అని క్యాప్షన్‌ జత చేశారు.
  • సమంత (Samantha) గత కొన్నిరోజుల నుంచి బాలి టూర్‌లో ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం తాను నివసిస్తోన్న ప్రదేశాన్ని తెలియజేస్తూ తాజాగా ఆమె కొన్ని ఫొటోలు షేర్‌ చేశారు. ఇందులో సామ్‌ స్విమ్మింగ్‌ పూల్‌ వద్ద కూర్చొని ఏదో ఆలోచిస్తూ కనిపించారు. ‘‘మంచి రోజులు రానున్నాయేమో. నీకు తెలియదు కదా’’ అని పేర్కొన్నారు.
  • ‘దయ’ సిరీస్‌తో విజయాన్ని అందుకున్నారు నటి ఇషారెబ్బా (Eesha Rebba). షూట్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు షేర్‌ చేసిన ఆమె.. ‘‘అలివేలు.. నా హృదయంలో ఈ పాత్ర ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఆ సిరీస్‌పై ఆదరణ కనబరుస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’’ అని తెలిపారు.














Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని