వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌ చిత్రంలో అంజలి!

వెంకటేశ్‌, వరుణ్‌ తేజ్‌ కథానాయకులుగా నటిస్తున్న చిత్రం ‘ఎఫ్‌ 3’. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ‘ఎఫ్‌2’కి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో తమన్నా, మెహరీన్‌ కథానాయికలు. మరో విశేషం ఏమిటంటే ఇందులో ‘వకీల్‌సాబ్‌’ నటి అంజలి కీలక పాత్ర పోషిస్తున్నారని వార్తలొస్తున్నాయి.

Published : 15 Apr 2021 14:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్: వెంకటేశ్‌, వరుణ్‌ తేజ్‌ కథానాయకులుగా నటిస్తున్న చిత్రం ‘ఎఫ్‌ 3’. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ‘ఎఫ్‌2’కి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో తమన్నా, మెహరీన్‌ కథానాయికలు. మరో విశేషం ఏమిటంటే ఇందులో ‘వకీల్‌సాబ్‌’ నటి అంజలి కీలక పాత్ర పోషిస్తున్నారని వార్తలొస్తున్నాయి. వచ్చే వారంలోనే అంజలి ‘ఎఫ్‌3’ షూటింగ్‌లో పాల్గొననుందని చెప్పుకుంటున్నారు. అయితే అధికారికంగా ఎక్కడా ఈ విషయం బయటకు రాలేదు. ఇందులో హాస్యనటుడు సునీల్ కూడా ఓ పాత్ర పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తుండగా, సాయి శ్రీరామ్‌ కెమెరామన్‌గా, తమ్మిరాజు ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని