సల్మాన్‌తో వరుణ్ స్టెప్పులు
ఓ కథానాయకుడి సినిమాలో మరో కథానాయకుడు అతిథిగా మెరవడం సినిమాకు అదనపు ఆకర్షణ. ఇలాంటి విషయాల్లో సల్మాన్‌ఖాన్
ఓ కథానాయకుడి సినిమాలో మరో కథానాయకుడు అతిథిగా మెరవడం సినిమాకు అదనపు ఆకర్షణ. ఇలాంటి విషయాల్లో సల్మాన్‌ఖాన్ ముందే ఉంటాడు. పలు చిత్రాల్లో అతిథి పాత్రల్లో మెరిశాడు. వరుణ్‌ధావన్ హీరోగా నటించిన ‘జుడ్వా’లో గెస్ట్‌రోల్ చేశాడు సల్మాన్. ఇప్పుడు సల్మాన్ చిత్రంలో వరుణ్ సందడి చేయబోతున్నాడు. తన బావమరిది ఆయుష్ శర్మతో కలిసి సల్మాన్ నటిస్తున్న చిత్రం ‘అంతిమ్’. మహేష్ మంజ్రేకర్ దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రంలో సల్మాన్ ఓ సిక్కు పోలీస్‌గా కనిపించబోతున్నాడు.
ఇందులో ఓ హుషారైన గీతం ఉందట. అందులో మరో హీరో స్టెప్పేస్తే బాగుంటుందనే ఆలోచనలో భాగంగా వరుణ్ పేరుని సూచించాడట సల్మాన్. వరుణ్ కూడా వెంటనే కాల్షీట్లు కేటాయించేశాడట. ఈ పాటనడీ ఈ నెల్లోనే తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇది పూర్తయ్యాకా షారుఖ్ ఖాన్ ‘పఠాన్’లోని అతిథి పాత్రలో నటించడానికి దుబాయ్‌కి షూటింగ్‌కి వెళ్లనున్నాడు సల్మాన్. వరుణ్ ప్రస్తుతం ‘జుగ్ జుగ్ జీయో’, ‘బేడియా’ చిత్రాల్లో నటిస్తున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..
-
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
-
జపాన్‌లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్