
కెనడాలో వైభవంగా ఉగాది వేడుకలు
టోరంటో: కెనడాలో తెలుగు అలయెన్సెస్ ఆఫ్ కెనడా (తాకా) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఏప్రిల్ 17న వర్చువల్‌గా నిర్వహించిన ఈ వేడుకల్లో 500 మందికి పైగా కెనడాలోని తెలుగు వారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సాంస్కృతిక కార్యదర్శి వాణి జయంతి, వ్యవస్థాపక సభ్యులు అరుణ్ లయం వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. తొలుత తాకా సాంస్కృతిక కార్యదర్శి వాణి జయంతి తన కుటుంబ సభ్యులతో కలిసి ఉగాది వేడుకలను జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. కెనడా, భారతదేశ జాతీయ గీతాలను ఆలపించారు. టొరంటోలో ఉన్న తెలుగు పూజారి నరసింహాచార్యులు పంచాంగ శ్రవణం వినిపించారు. కొత్త సంవత్సర రాశి ఫలాలను అందరికీ వివరించారు. తాకా అధ్యక్షులు శ్రీనాథ్ కందుకూరి అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపి కొవిడ్ కష్టకాలంలో తాకా చేస్తోన్న అనేక కార్యక్రమాలను వివరించారు.
తాకా వ్యవస్థాపక ఛైర్మన్ చారి సామంతపూడి కెనడాలోని తెలుగు వారందరికీ ఎన్నో సేవలందిస్తున్న అల్బెర్టా మంత్రి పాండా ప్రసాద్, సన్‌డైన్ అధినేత శ్రీధర్ ముండ్లూరు, టోరంటో తెలుగు టైమ్స్ అధినేత సర్దార్ ఖాన్లకు ఉగాది పురస్కారాలను ప్రకటించి వారి సేవలను కొనియాడారు. తెలుగు చలన చిత్ర గాయకుడు దినకర్ కల్వల అనేక పాటలు ఆలపించి అలరించారు. అనంతరం మాన్వి కార్యంపూడి, సంజిత చల్ల, సీత మైలవరపు, దుర్గ మైలవరపు, ఆశ్రిత పొన్నపల్లి, పూష్ని కోట్ల, శ్రిష్టి దామెరశెట్టి, తారుణి దేసు, మేధా గేదెల, వత్స సంక, శ్లోక కేశర్వాణి, అజయ్ అనమంగండ్ల, సంయుత గందె, సాయిశ్రీ పులివర్తి, సహస్ర కోట, వైభవ్య కుప్పం, హరిలౌక్య కుప్పం, రోహన్ ముటుపూరుల పాటలు, నృత్యాలు అందరినీ ఎంతో ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకు కృషిచేసిన డైరెక్టర్లు మల్లికార్జున చారి పదిర, ప్రవీణ్ పెనుబాక, రాజారామ్ మోహన్‌రాయ్ పుల్లంశెట్టి, కోశాధికారి సురేష్ కూన, కల్చరల్ సెక్రటరీ వాణి జయంతి, వైస్ ప్రెసిడెంట్ కల్పన మోటూరి, కార్యదర్శి నాగేంద్ర హంసాల, ట్రస్ట్ సభ్యులు బాషాషేక్, రామ చంద్రరావు దుగ్గిన, రాఘవ్ అల్లం, రాణి మద్దెల, ప్రసన్న తిరుచిరాపల్లిని, ఇతర వ్యవస్థాపక సభ్యులు రవి వారణాసి, రమేష్ మునుకుంట్ల, రాకేశ్ గరికపాటి, లోకేశ్ చిల్లకూరు, మునాఫ్ అబ్దుల్‌ను తాకా అధ్యక్షుడు శ్రీనాథ్ కందుకూరి అభినందించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.