దిల్లీ చేరుకున్న ఏపీ సీఎం జగన్‌

ఏపీ సీఎం జగన్‌ దిల్లీ చేరుకున్నారు. అమరావతి నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి హస్తిన వచ్చారు. రాత్రి 9 గంటలకు కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షాతో జగన్‌ భేటీ అయ్యే అవకాశముంది. ప్రధాని మోదీతో భేటీపైనా

Updated : 15 Dec 2020 20:27 IST

దిల్లీ: ఏపీ సీఎం జగన్‌ దిల్లీ చేరుకున్నారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి హస్తిన వచ్చారు. ఈరోజు రాత్రి 9 గంటలకు కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షాతో జగన్‌ భేటీ అయ్యే అవకాశముంది. ప్రధాని మోదీతో భేటీపైనా స్పష్టత రావాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఈ నెల 8న రైతులు చేపట్టిన దేశవ్యాప్త బంద్‌కు ఏపీ ప్రభుత్వం మద్దతు తెలిపింది. ఆ రోజున మధ్యాహ్నం వరకు ప్రభుత్వ కార్యాలయాలను మూసివేసింది. ఈ అంశమే ప్రధానంగా అమిత్‌ షా, జగన్‌ భేటీలో చర్చకు వచ్చే ఆస్కారముందని తెలిసింది. మరోవైపు పోలవరం ప్రాజెక్టుపై సవరించిన అంచనాలను ఆమోదించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది. పోలవరంపై అమిత్‌ షా జోక్యాన్ని సీఎం జగన్‌ కోరనున్నట్లు సమాచారం. దీంతో పాటు నివర్‌ తుపానుతో రాష్ట్రంలో జరిగిన నష్టానికి కేంద్ర సాయంపైనా సీఎం చర్చించే అవకాశముంది. దిల్లీ పర్యటనలో జగన్‌ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మార్గాని భరత్‌, అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌ తదితరులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని