ముషీరాబాద్‌ ఎమ్మెల్యేను అడ్డుకున్న కాంగ్రెస్‌ శ్రేణులు

ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్‌ను కాంగ్రెస్‌ శ్రేణులు అడ్డుకున్నాయి. ఈ ఘటన కేర్‌ ఆస్పత్రి వద్ద చోటుచేసుకుంది.

Published : 11 Oct 2020 17:03 IST

రాంనగర్‌: ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్‌ను కాంగ్రెస్‌ శ్రేణులు అడ్డుకున్నాయి. ఈ ఘటన కేర్‌ ఆస్పత్రి వద్ద చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే రెండు రోజుల క్రితం సెల్లార్‌లో నిలిచిన వర్షం నీటిలో పడి ప్రమాదవశాత్తు మరణించిన హైకోర్టు ఉద్యోగి రాజ్‌కుమార్‌ కుటుంబాన్ని పరామర్శించడానికి యువజన కాంగ్రెస్‌ రాష్ట్రాధ్యక్షుడు అనిల్‌యాదవ్‌ వెళ్లారు. ఆయనకు రాజ్‌కుమార్‌ కుటుంబసభ్యులు తమ గోడును వెళ్లబోసుకుంటూ అధికారులెవరూ తమను పట్టించుకోలేదని, కరెంటు, తాగునీరు కూడా సరఫరా చేయలేదని వాపోయారు. అదే సమయంలో అక్కడే ఎదురుగా ఉన్న ఆర్వవైశ్య సంఘం సమావేశానికి ఎమ్మెల్యే ముఠాగోపాల్‌ హాజరయ్యారు. ఆయన తిరిగొచ్చే సమయంలో బాధితులకు న్యాయం చేయాలంటూ అనిల్‌కుమార్‌ నేతృత్వంలో కాంగ్రెస్‌ శ్రేణులు అడ్డుకున్నాయి. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో ఎమ్మెల్యే ముఠాగోపాల్‌ సంఘటనా స్థలాన్ని సందర్శించి అధికారులతో మాట్లాడారు. సెల్లార్‌లో నీటిని తొలగించాలని సూచించారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వ పరంగా అదుకుంటామని రాజ్‌కుమార్‌ కుటుంబసభ్యులకు ఆయన హామీ ఇచ్చారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని