అసెంబ్లీ నిర్వహణకు ఓకే.. కానీ 3 షరతులు!

అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలంటూ అశోక్‌ గహ్లోత్‌ వర్గం నుంచి వినతులు వస్తున్న నేపథ్యంలో రాజస్థాన్ గవర్నర్‌ కల్‌రాజ్‌ మిశ్రా స్పందించారు. అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడానికి తాను సిద్ధమేనని, ఈ విషయంలో ఎలాంటి ఇతర ఉద్దేశాలూ లేవని పేర్కొన్నారు. అయితే మూడు షరతులు అశోక్‌ గహ్లోత్‌ ......

Updated : 27 Jul 2020 18:41 IST

జైపుర్‌: అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలంటూ అశోక్‌ గహ్లోత్‌ వర్గం నుంచి వినతులు వస్తున్న నేపథ్యంలో రాజస్థాన్ గవర్నర్‌ కల్‌రాజ్‌ మిశ్రా స్పందించారు. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడానికి తాను సిద్ధమేనని, ఈ విషయంలో ఎలాంటి ఇతర ఉద్దేశాలూ లేవని పేర్కొన్నారు. అయితే మూడు షరతులు అశోక్‌ గహ్లోత్‌ ప్రభుత్వం ముందు ఉంచారు. సమావేశాల నిర్వహణకు 21 రోజుల ముందు నోటీసుకు అంగీకరిస్తే సమావేశాల నిర్వహణకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ మెలిక పెట్టారు. కరోనా సంక్షోభం వేళ తక్కువ సమయంలో ఎమ్మెల్యేలను సమావేశాలకు హాజరవ్వాలని చెప్పడం సమంజసం కాదని పేర్కొన్నారు. అలాగే సమావేశాల్లో భౌతిక దూరం ఎలా అని ప్రశ్నించారు.

మరోవైపు అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలనుకుంటే దానికి ప్రత్యక్ష ప్రసారం నిర్వహించాల్సి ఉంటుందని గవర్నర్‌ పేర్కొన్నారు. అయినా, కేబినెట్‌ పంపిన ప్రతిపాదనలో అది లేదన్నారు. మీడియాలో మాత్రం సీఎం బల నిరూపణ గురించి మాట్లాడతున్నారని చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలంటూ అశోక్‌ గహ్లోత్‌ మంత్రివర్గం రెండు సార్లు పంపిన సిఫార్సులను గవర్నర్‌ను తిప్పి పంపారు. తొలి సిఫార్సులు పంపించడంతో రెండోసారి ప్రతిపాదనల్లో బలనిరూపణ అనే ప్రస్తావన లేకుండా కేవలం కరోనా, ఇతర అంశాలపై చర్చించేందుకే అని గహ్లోత్‌ కేబినెట్‌ పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని