పీవీ బహుముఖ ప్రజ్ఞాశాలి: కవిత

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు బహుముఖ ప్రజ్ఞాశాలి అని, దేశానికి ఆయన అందించిన సేవలు మరువలేనివని మాజీ ఎంపీ కవిత అన్నారు. ‘సాహితీ సౌరభం- అసమాన దార్శనికత’ పేరుతో నిర్వహించిన సమాలోచన..

Updated : 26 Aug 2020 14:29 IST

హైదరాబాద్‌: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు బహుముఖ ప్రజ్ఞాశాలి అని, దేశానికి ఆయన అందించిన సేవలు మరువలేనివని మాజీ ఎంపీ కవిత అన్నారు. ‘సాహితీ సౌరభం- అసమాన దార్శనికత’ పేరుతో నిర్వహించిన సమాలోచన సభకు ఆమె అధ్యక్షత వహించారు. దేశానికి, రాష్ట్రానికి పీవీ అందించిన సేవలు, సంస్కరణలపై చర్చించారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ... దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉండగా పీవీ ప్రధాని పదవి చేపట్టి దేశాన్ని ముందుకు నడిపించారని గుర్తు చేశారు. పీవీ మేధస్సుకు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో అక్షర నివాళి అర్పిస్తున్నట్టు చెప్పారు. జాగృతి ఆధ్వర్యంలో పీవీ బుక్‌ క్లబ్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పీవీ శతజయంతి ప్రత్యేక కార్యక్రమాలు ప్రతినెలా రెండు సార్లు నిర్వహిస్తామన్నారు. పీవీ సేవలను యువతరానికి తెలియజేసేలా శతజయంతి కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు.

పీవీ కుమార్తె వాణి మాట్లాడుతూ... పీవీ తొలిసారి జైళ్లశాఖను నిర్వర్తించి అనేక సంస్కరణలు తీసుకొచ్చారని గుర్తు చేశారు. పీవీకి జ్ఞాపకశక్తి చాలా ఎక్కువగా ఉండేదని, చదువుతో ప్రధాని కావొచ్చని ఆయన నిరూపించారన్నారు. పీవీ పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రేమ, ఆప్యాయత ఉన్నాయన్నారు. రాజ్యసభ సభ్యుడు కేశవరావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని