ఓట్ల లెక్కింపునకు మూడంచెల భద్రత

రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో జరిగే గ్రేటర్‌ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ తెలిపారు. ఎన్నికల

Published : 21 Nov 2020 17:48 IST

రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌

హైదరాబాద్‌: రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో జరిగే గ్రేటర్‌ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ తెలిపారు. ఎన్నికల సంఘం సూచనల మేరకు పటిష్ట బందోబస్తు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఎల్బీనగర్‌ జోన్‌లో 13 వార్డులు, మల్కాజిగిరిలో 17 వార్డులు రాచకొండ పరిధిలో ఉన్నాయని సీపీ వివరించారు. అవన్నీ అత్యంత సున్నితమైన 12 పోలీసు స్టేషన్ల పరిధిలో ఉన్నట్లు గుర్తించామన్నారు. మొదటిసారిగా అన్ని పోలీసు స్టేషన్లకు జియో ట్యాగింగ్‌ చేసినట్లు చెప్పారు. స్పెషల్‌ బ్రాంచ్‌లో ఎన్నికల సెల్‌ను ఏర్పాటు చేశామని.. దీనిని నోడల్‌ అధికారి పర్యవేక్షిస్తారని సీపీ వివరించారు.

ప్రింటింగ్‌ ప్రెస్‌కు బందోబస్తు కల్పించామని, అదేవిధంగా పోలింగ్‌ కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు సీపీ వివరించారు. ఓట్ల లెక్కింపునకు మూడంచెల భద్రత ఉంటుందన్నారు. సమస్యాత్మక పోలీసు స్టేషన్లలో ముందస్తు చర్యల్లో భాగంగా రౌడీషీటర్ల బైండోవర్‌ కొనసాగుతుందన్నారు. ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలతో సమావేశమైనట్లు సీపీ తెలిపారు. రోడ్‌షోలకు తప్పకుండా అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. వాట్సాప్‌, కాల్‌ సెంటర్‌ ద్వారా పోలీసులకు ప్రజలు ఫిర్యాదు చేయవచ్చని సీపీ వెల్లడించారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts