Eluru Elections: 15 చోట్ల వైకాపా.. ఒక చోట తెదేపా విజయం

ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల్లో

Updated : 25 Jul 2021 13:12 IST

ఏలూరు: ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల్లో వైకాపా 15, తెదేపా ఒక డివిజన్లలో విజయం సాధించాయి. 2, 4, 19, 23, 24, 25, 33, 38, 39, 40, 41, 42, 45, 46, 50 డివిజన్లలో వైకాపా గెలుపొందగా.. 37వ డివిజన్‌లో తెదేపా అభ్యర్థి విజయం సాధించారు. 2వ డివిజన్‌లో వైకాపా అభ్యర్థి జి. శ్రీనివాసరావు 788 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. 4వ డివిజన్‌లో డింపుల్‌ (వైకాపా), 19వ డివిజన్‌లో యర్రంశెట్టి నాగబాబు (వైకాపా-1012), 23వ డివిజన్‌లో కడవకోళ్లు సాంబ (వైకాపా), 33వ డివిజన్‌లో కె.రామ్మోహనరావు (వైకాపా- 88),  38వ డివిజన్‌లో హేమమాధురి (వైకాపా-261), 39వ డివిజన్‌లో జ్యోతి (వైకాపా- 799), 41వ డివిజన్‌లో కల్యాణీదేవి (వైకాపా- 547), 42వ డివిజన్‌లో ఎ.సత్యవతి (వైకాపా- 79), 45వ డివిజన్‌లో ప్రతాపచంద్ర ముఖర్జీ (వైకాపా- 1058), 46వ డివిజన్‌లో ప్యారీ బేగం (వైకాపా- 1232), 50వ డివిజన్‌లో మేయర్‌ అభ్యర్థి (నూర్జహాన్‌-1495) జయకేతనం ఎగురవేశారు. వీరిలో ప్రతాపచంద్ర ముఖర్జీ కొద్దిరోజుల క్రితం కొవిడ్‌తో మృతిచెందారు. మరోవైపు 37వ వార్డులో తెదేపా అభ్యర్థి పృథ్వీ శారద (తెదేపా-150) విజయం సాధించారు. 

అంతకుముందు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలోనూ వైకాపా ఆధిక్యం ప్రదర్శించింది. పోస్టల్‌ బ్యాలెట్‌లో మొత్తం 15 ఓట్లు పోలవగా.. అందులో వైకాపా 11, తెదేపా, నోటాకు ఒక్కో ఓటు వచ్చాయి. మరో 2 ఓట్లు చెల్లలేదు. సీఆర్‌ రెడ్డి కళాశాలలో ఓట్ల లెక్కింపు ప్రక్రియను జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా పరిశీలించారు. కళాశాలలోని 4 కేంద్రాల్లో లెక్కింపు చేపట్టారు. ఒక్కో డివిజన్‌కు ఒక్కో లెక్కింపు టేబుల్‌ కేటాయించారు. 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని