ఓఎస్డీకి కరోనా:  ఆ సీఎం మళ్లీ ఐసోలేషన్‌లోకి..!

ఉత్తరాఖండ్‌ సీఎం త్రివేంద్ర సింగ్‌ రావత్‌ మరోసారి స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. తాజాగా తన ఓస్డీకి పాజిటివ్‌గా తేలడంతో మూడు రోజుల పాటు సీఎం క్వారంటైన్‌లో............

Published : 03 Sep 2020 02:46 IST

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌ సీఎం త్రివేంద్ర సింగ్‌ రావత్‌ మరోసారి స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. తాజాగా తన ఓఎస్డీకి పాజిటివ్‌గా తేలడంతో మూడు రోజుల పాటు సీఎం క్వారంటైన్‌లో ఉండనున్నట్టు అధికారికవర్గాలు తెలిపాయి. దీంతో ఈ రోజు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సైతం వాయిదా పడింది. గతంలో తన సలహాదారులకు వైరస్‌ సోకడంతో ఆగస్టు 25న సీఎం హోం క్వారంటైన్‌లో కివెళ్లారు. దీంతో అప్పుడు కూడా (ఆగస్టు 26న) జరగాల్సిన కేబినెట్‌ భేటీ వాయిదా పడింది. ఆగస్టు 30న నిర్వహించిన కొవిడ్‌ పరీక్షల్లో తనకు నెగెటివ్‌గా తేలడంతో సెల్ఫ్‌ క్వారంటైన్‌ నుంచి రావత్‌ బయటకు వచ్చారు.

ఈ క్రమంలోనే సెప్టెంబర్‌ 2న రాష్ట్రకేబినెట్‌ సమావేశం నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ.. తాజాగా ఆయన ఓఎస్డీ కొవిడ్‌ బారినపడటంతో సీఎం మళ్లీ స్వీయ నిర్బంధంలోకి వెళ్లాల్సి వచ్చింది. దీంతో ఈ రోజు జరగాల్సిన కేబినెట్‌ భేటీ వాయిదా పడింది. ఉత్తరాఖండ్‌లో ఇప్పటివరకు 20,398 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీరిలో 14,076మంది కోలుకోగా.. 280మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 6042 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని