Aleti Maheshwar reddy: కాంగ్రెస్‌కు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి రాజీనామా

కాంగ్రెస్‌కు మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ రాష్ట్ర ఛైర్మన్‌ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి రాజీనామా చేశారు.

Updated : 13 Apr 2023 15:10 IST

దిల్లీ: కాంగ్రెస్‌కు మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ రాష్ట్ర ఛైర్మన్‌ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గేకు పంపారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలపై గతకొంతకాలంగా అసంతృప్తితో ఉన్న మహేశ్వర్‌రెడ్డి.. నేడు రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. 

కాంగ్రెస్‌కు రాజీనామా అనంతరం దిల్లీలో తెలంగాణ భాజపా వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ తరుణ్‌ఛుగ్‌తో మహేశ్వర్‌రెడ్డి భేటీ అయ్యారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌, ఇతర నేతలతో వెళ్లి ఆయన్ను కలిశారు. కాసేపట్లో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో వచ్చేది భాజపా ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని