Andhra News: ఏ వ్యవస్థపైనా మేము దాడి చేయడం లేదు: బొత్స

ప్రభుత్వానికి ఉన్న అధికారాలతోనే 3 రాజధానుల చట్టం చేశామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని

Updated : 25 Mar 2022 05:44 IST

అమరావతి: ప్రభుత్వానికి ఉన్న అధికారాలతోనే 3 రాజధానుల చట్టం చేశామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని రైతులతో చేసుకున్న ఒప్పందాలను ప్రభుత్వం అమలు చేస్తుందని స్పష్టం చేశారు. ఉక్రోషంతోనే చంద్రబాబు మాట్లాడుతున్నారని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన  ప్రతీ ప్రభుత్వానికి ఓ విధానం ఉంటుందని, దాని ప్రకారమే నిర్ణయాలు తీసుకుంటారని పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాల్లో ఎక్కడైనా లోపం ఉంటే మార్పులు.. చేర్పులు ఉంటాయన్నారు. ఏ వ్యవస్థపైనా తాము దాడి చేయలేదని వెల్లడించారు. రాజ్యాంగానికి లోబడే చట్టాలు ఉంటాయని, ఏ వ్యవస్థ అయినా దాని పరిధిలోనే పనిచేయాలన్నారు. హైకోర్టు తీర్పుపై చంద్రబాబు సభలో మాట్లాడాల్సిందని మంత్రి వ్యాఖ్యానించారు. తెదేపా శాసనసభ్యులు రాజీనామా చేసి ప్రజాభిప్రాయాన్ని కోరవచ్చని మంత్రి ఎద్దేవా చేశారు. అమరావతి ప్రాంతంలో మిగిలింది 7,300 ఎకరాలు మాత్రమేనని, అది విక్రయిస్తే రూ.లక్ష కోట్లు వస్తుందా? అని బొత్స ప్రశ్నించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని