Atchannaidu: రూ.40వేల కోట్లు దోచుకున్న ఆ గజదొంగ ఎవరు?: అచ్చెన్న

ప్రజలకు ఉచితంగా ఇసుక ఇచ్చిన చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టడం సిగ్గు చేటని ఏపీ తెదేపా అధ్యక్షుడు అచ్చెన్నాయడు ధ్వజమెత్తారు.

Published : 02 Nov 2023 21:55 IST

అమరావతి: గత నాలుగున్నరేళ్లలో ఇసుక బుక్కేసి రూ.40 వేల కోట్లు దోచుకున్న గజదొంగ ఎవరని ఏపీ తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. మీరంతా ఇసుకను దోచేసి.. ప్రజలకు ఉచితంగా ఇసుక ఇచ్చిన చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టడం సిగ్గు అనిపించడం లేదా? అని మండిపడ్డారు. అధికారికంగా 110 రీచ్‌ల్లో ఇసుక తవ్వకాలని చెబుతూ.. 500కు పైగా రీచ్‌ల్లో దోచేయటం వాస్తవం కాదా? అని నిలదీశారు. గురువారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  ‘ఏపీలో ఇసుక తవ్వకాలను నిలిపివేయాలని ఎన్జీటీ ఉత్వర్వులివ్వలేదా? మీ ఇసుక దోపిడీకి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి?’ అని సీఎం జగన్‌పై ధ్వజమెత్తారు.

‘‘ఉచితంగా ఇసుక ఇచ్చిన చంద్రబాబుపై కేసు పెడితే, పేదల కడుపు కొట్టి రూ.40 వేల కోట్లు దోచుకున్న జగన్ రెడ్డి, పెద్దిరెడ్డిపై ఏం కేసులు పెట్టాలి? ఉచిత ఇసుక రద్దు చేసి, 40 లక్షల మంది కార్మికుల్ని రోడ్డున పడేసి, 160 మంది భవన నిర్మాణ కార్మికుల్ని బలిగొన్న జగన్ రెడ్డి.. ఇప్పటికే 3 సార్లు ఇసుక పాలసీ మార్చారు. ఇప్పుడు తన తమ్ముడు అనిల్ రెడ్డికి ఇసుక కాంట్రాక్టు కట్టబెట్టేందుకు కొత్త నాటకానికి తెరలేపారు. ఇసుక టెండర్లు అనిల్ రెడ్డికి కట్టబెట్టేందుకు టెండర్ నిబంధనల్నీ మార్చేసి డాక్యుమెంట్ ధరను రూ.29.5 లక్షలుగా నిర్ధరించారు. ఉన్న ఆరునెలల్లో రాష్ట్రంలో ఉన్న ఇసుకంతా దోచేయాలన్నదే జగన్ రెడ్డి ప్లాన్, అందుకే ఈ కుట్ర. ఇసుకతో పాటు బైరైటీస్, బాక్సైట్, లేటరైట్, రాక్సీ గ్రానైట్, సిలికాను కూడా దోచేస్తున్నారు’’ అని అచ్చెన్నాయుడు విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని