11ఏళ్ల పాపకు నోటీసులిస్తామని బెదిరిస్తారా? సీఐడీ తీరుపై మండిపడ్డ అచ్చెన్న

ప్రజాసమస్యలపై స్పందిస్తున్న దళిత ఉద్యమ నేత కొలికిపూడి శ్రీనివాసరావు పట్ల జగన్‌రెడ్డి వేధింపులు దుర్మార్గమని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు.

Published : 31 Dec 2023 18:02 IST

అమరావతి: ప్రజాసమస్యలపై స్పందిస్తున్న దళిత ఉద్యమ నేత కొలికిపూడి శ్రీనివాసరావు పట్ల జగన్‌రెడ్డి వేధింపులు దుర్మార్గమని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. హైదరాబాద్‌లోని కొలికిపూడి నివాసానికి వెళ్లిన సీఐడీ అధికారులు.. ఆయన కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 11ఏళ్ల పాపకు నోటీసులు ఇస్తామని బెదిరించడం అమానవీయమని ధ్వజమెత్తారు. నియంతలు పాలిస్తున్న దేశాల్లో కూడా ఇంతటి క్రూరత్వం లేదని దుయ్యబట్టారు. కొలికిపూడి నివాసానికి విజిటర్స్‌గా వచ్చిన సీఐడీ అధికారులు బీభత్సం సృష్టించారని విమర్శించారు. కొలికిపూడి శ్రీనివాసరావు చేసిన తప్పు ఏమిటని ప్రశ్నించారు. ప్రశ్నించే వారిని చూసి జగన్‌రెడ్డి తట్టుకలేకపోతున్నారని మండిపడ్డారు. వందరోజుల్లో జగన్‌రెడ్డిని ప్రజలు తరిమేయడం ఖాయమని హెచ్చరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని