Andhra News: వైకాపా నాయకులు రాష్ట్రాన్ని క్రైమ్ క్యాపిటల్‌గా మార్చారు: అచ్చెన్నాయుడు

వైకాపా నాయకులు రాష్ట్రాన్ని క్రైమ్ క్యాపిటల్‌గా మార్చారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. కాకినాడలో సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైకాపా ఎమ్మెల్సీ అనంత

Published : 22 May 2022 02:03 IST

అమరావతి: వైకాపా నాయకులు రాష్ట్రాన్ని క్రైమ్ క్యాపిటల్‌గా మార్చారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. కాకినాడలో సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైకాపా ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ రెడ్ హ్యాండెడ్‌గా దొరికినా పోలీసులు అరెస్టు చేయకుండా నిందితులను కాపాడుతూ బాధితులను వేధించడం దుర్మార్గమని మండిపడ్డారు. పోస్టుమార్టం కోసం సుబ్రహ్మణ్యం కుటుంబసభ్యులను పోలీసులు వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరును ప్రశ్నించినందుకు మృతుడి భార్యపైన చేయిచేసుకోవడం వైకాపా రాక్షస పాలనకు నిదర్శనమన్నారు.

‘‘ముఖ్యమంత్రి జగన్‌ విహారయాత్రకు వెళుతూ వైకాపా మూకలను ప్రజల మీదికి వదలివెళ్లారు. రాష్ట్రంలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. సంఘటన జరిగి 24 గంటలు గడుస్తున్నా బాధిత కుటుంబాన్ని వైకాపా నేతలు ఎందుకు పరామర్శించలేదు? రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. బాధిత కుటుంబానికి అండగా నిలబడినందుకు తెలుగుదేశం పార్టీ నేతలు, దళిత సంఘాలపై దాడులకు దిగుతున్నారు. వైకాపా ఎమ్మెల్సీ ఉదయభాస్కర్‌ను అరెస్టు చేసి బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు తెలుగుదేశం పార్టీ పోరాడుతూనే ఉంటుంది’’ అని అచ్చెన్నాయుడు తేల్చి చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని