‘పోలీసు వాహనాలకు వైకాపా రంగులా?’

పోలీస్‌ షీ టీమ్స్‌ వాహనాలకు వైకాపా రంగులు వేయడమే కాకుండా, ప్రభుత్వ అధికారే వాటిని ప్రారంభించి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారని

Updated : 29 Feb 2024 17:45 IST

తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు

అమరావతి: పోలీస్‌ షీ టీమ్స్‌ వాహనాలకు వైకాపా రంగులు వేయడమే కాకుండా, ప్రభుత్వ అధికారే వాటిని ప్రారంభించి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఈమేరకు ఏపీ డీజీపీ గౌతమ్‌సవాంగ్‌కు లేఖ రాశారు. మహిళల రక్షణ కోసం తెదేపా ప్రభుత్వం షీ టీమ్స్‌ను బలోపేతం చేసి దాదాపు 800కు పైగా వాహనాలు సమకూర్చిందన్నారు.

 నేడు ఆ వాహనాలకే వైకాపా రంగులు అద్ది తిరిగి పంపిణీ చేశారని లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు రంగుల కోసం రూ.3,500 కోట్ల ప్రజాధనాన్ని వృథా చేశారని, దీనిపై సర్వోన్నత న్యాయస్థానం ఎండగట్టిందని గుర్తు చేశారు. రాత్రింబవళ్లు శాంతిభద్రతలను సంరక్షిస్తూ ప్రజలకు రక్షణ కల్పించే పోలీసులకు రాజకీయ ముద్ర వేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. వాహనాలకు రంగులు వేసి ప్రచార రథాలుగా మార్చారని, ప్రజలు పోలీస్‌ వ్యవస్థపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేసే విధంగా వైకాపా ప్రభుత్వ తీరు ఉందని లేఖలో పేర్కొన్నారు.

ఇవీ చదవండి..
సాగర్‌ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తాం: తెదేపా

మమతకు విపక్ష నేతల సంఘీభావం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని