TS News: హుజూరాబాద్‌లో భాజపా భారీ మెజార్టీతో గెలవబోతోంది: బండి సంజయ్‌

హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో తెరాస అప్రజాస్వామికంగా వ్యవహరించి ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహరించిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు

Updated : 24 Sep 2022 16:09 IST

హైదరాబాద్‌: హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో తెరాస అప్రజాస్వామికంగా వ్యవహరించి ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహరించిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. తెరాస ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా ప్రజలు నిష్పక్షపాతంగా న్యాయం, ధర్మం వైపు నిలిచారని పేర్కొన్నారు. తెరాస నేతలు విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడినా, అధికార యంత్రాంగంతో భాజపాపై ఒత్తిడి తీసుకొచ్చి కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేసినా లెక్కచేయకుండా విజయం కోసం కృషి చేసిన భాజపా శ్రేణులకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు బండి సంజయ్‌ ఓ ప్రకటనలో తెలిపారు. కేసీఆర్‌ అహంకారానికి, హుజూరాబాద్‌ ప్రజల ఆత్మగౌరవానికి జరిగిన పోటీలో ప్రజలు మంచి ఆలోచనతో భాజపాను ఆదరించారని పేర్కొన్నారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఓటింగ్‌లో పాల్గొన్న ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ శ్రేణుల నుంచి అందిన సమాచారం ప్రకారం భాజపా భారీ మెజార్టీతో గెలవబోతోందని బండి సంజయ్‌ ధీమా వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని